Allu Sirish: సినిమాలకు బై బై.. ఇవన్నీ నాకెందుకు.. అల్లు శిరీష్ కామెంట్స్ వెనుక ఉన్న అర్థం ఏంటి?
అల్లు సినిమాస్ ఓపెనింగ్ ఈవెంట్ లో ఆసక్తికర కామెంట్స్ చేసిన అల్లు శిరీష్(Allu Sirish).
- V Santhosh Kumar
- Published On : March 14, 2026 / 09:22 AM IST
allu sirish interesting comments on his upcoming movies
- అల్లు శిరీష్ రిటైర్మెంట్ కామెంట్స్
- అల్లు శిరీష్ సినిమాలకు బై బై చెప్పేశాడట
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్
Allu Sirish: మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆయన తన భార్య నాయనికా రెడ్డితో కలిసి ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడ సందడి చేస్తున్న సమయంలో, కొంతమంది ఆయనతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించగా.. శిరీష్(Allu Sirish) అనూహ్యంగా స్పందించారు. “ఇవన్నీ నాకెందుకు.. నేను రిటైర్ అయిపోయిన వాణ్ణి” అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. దీంతో అల్లు శిరీష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Chiru- Prabhas: కలిసి వస్తున్న మెగాస్టార్, రెబల్ స్టార్.. సెకండ్ హాఫ్ బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం.
అల్లు శిరీష్ చేసిన ఈ “రిటైర్మెంట్” కామెంట్స్ పై నెటిజన్ల నుంచి కూడా రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి. ఆయన నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పేశారా? లేక సరదాగా అన్నారా? అన్న చర్చ మొదలైంది. నిజానికి, అల్లు శిరీష్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, బ్యాడ్ లక్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు.
అందుకే, సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అల్లు శిరీష్ సినిమాలకు స్వస్తి పలికినా, ఆయనకు కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అల్లు అరవింద్ వారసుడిగా గీతా ఆర్ట్స్, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్, ఇప్పుడు మల్టీప్లెక్స్ లాంటి భారీ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన చూసుకోవడానికి, చేసుకోవడానికి బోలెడంత పని ఉంది. ఏది ఏమైనా, మెగా అభిమానులు మాత్రం శిరీష్ వ్యాఖ్యలను కేవలం సరదాగా చేసినవిగానే భావిస్తున్నారు. ఇక ఆయన నడిచిన బడ్డీ సినిమా తరువాత ఇప్పటివరకు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ హీరో.
