Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్యకి అరుదైన గౌరవం.. బౌలీ ఆర్ట్ సంఘం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డికి(Allu Sneha Reddy) ప్రతిష్టాత్మక బౌలీ ఆర్ట్ సంఘం 'కల్చర్ అండ్ హెరిటేజ్' విభాగం చైర్‌పర్సన్‌గా అరుదైన గౌరవం దక్కింది.
- V Santhosh Kumar
- Published on- November 12, 2026 / 05:38 PM IST
Allu sneha reddy appointed as chairperson of culture and heritage at baoli art sangam
Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి కేవలం స్టార్ హీరో భార్యగానే కాకుండా, వ్యాపారవేత్తగా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమెకు కళా, సాంస్కృతిక రంగాలలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘బౌలీ ఆర్ట్ సంఘం’ (Baoli Art Sangam) కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి నియమితులయ్యారు. కళలు, వారసత్వ సంపద పరిరక్షణ, సంస్కృతి పట్ల ఆమెకున్న మక్కువను, నిబద్ధతను గుర్తించి సంస్థ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
IPS Transfers: తెలంగాణలో 21 మంది IPSల బదిలీ.. హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్!
వారసత్వ కళల పరిరక్షణలో కొత్త అధ్యాయం.. అభిమానులు, ప్రముఖుల అభినందనల వెల్లువ!
భారతీయ సాంప్రదాయ కళలు, చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను భావితరాలకు అందించడంలో బౌలీ ఆర్ట్ సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ విభాగానికి చైర్‌పర్సన్‌గా స్నేహారెడ్డి(Allu Sneha Reddy) బాధ్యతలు స్వీకరించడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు మరింత ఊపు రానుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన బాధ్యతల ద్వారా స్థానిక కళాకారులను ప్రోత్సహించడంతో పాటు విభిన్న కళారూపాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఆమె కృషి చేయనున్నారు. అల్లు స్నేహారెడ్డికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల అల్లు అభిమానులతో పాటు సినీ, సాంస్కృతిక రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
