Alluri Movie: యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్ ‘అల్లూరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. నిజాయితీకి మారు పేరు’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న చిత్రాన్ని ప్రదీప్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా, లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.
Alluri Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అల్లూరి!
ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న నేపధ్యంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విలేఖరుల సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 3 నుండి అల్లూరి టీం యాత్రని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్‌కి ఆయన పోలీస్ డ్రెస్‌లో రావడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బ్యానర్ స్థాపించి 15 ఏళ్ళయ్యింది. మీ అందరి సహకారంతో విజయాలు సాధిస్తూ ముందుకు వచ్చాను. ఈ ప్రయాణంలో ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ప్రాధన్యత ఇచ్చాను. మంచి కంటెంట్‌తో యాక్షన్ సినిమా తీయాలని వుండేది. అలాంటి సమయంలో ప్రదీప్ వర్మ ‘అల్లూరి’ కథ చెప్పారు.
Alluri : మరో అల్లూరి సీతారామరాజు.. శ్రీ విష్ణు కొత్త ప్రయోగం..
‘అల్లూరి’ పేరు వింటనే ఒక పవర్ వస్తుంది. అంతే పవర్ఫుల్ స్టొరీ ఇది. ఎవరికైనా పోలీసు అవ్వాలని వుంటుంది. నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని అనుకున్నాను. ‘అల్లూరి’ సినిమా చాలా ఎమోషనల్‌గా, ఇష్టంగా చేశాను. సినిమాపై వున్న ప్రేమ గౌరవంతోనే మీముందుకు పోలీస్ డ్రెస్‌తో వచ్చాను. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్నాయి. సెప్టెంబర్ 23న సినిమా విడుదలౌతుందని ముందే ప్రకటించాం. రేపటి నుండి సినిమాకి సంబంధించిన పాటలు వరుసగా విడుదల చేసి పదిరోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం.. అని నిర్మాత బెక్కెం వేణుగాపోల్ ప్రకటించారు.