Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబు రాజకీయాలతోనే కాక తన డ్యాన్సులతో కూడా బాగా వైరల్ అయ్యారు. పండగలకు తన నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి అంబటి రాంబాబు సరదాగా డ్యాన్సులు వేస్తారు. గతంలో పలుమార్లు అంబటి రాంబాబు డ్యాన్సులు వైరల్ అయ్యాయి కూడా. దీనిపై పలువురు రకరకాలుగా కామెంట్స్ చేసారు. అయితే అంబటి రాంబాబు మాత్రం ప్రజలతో సరదాగా కలిసిపోయి పండగపూట డ్యాన్స్ వేసి ఉత్సాహపరచడంలో తప్పేముంది అంటూ ఆయనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
తాజాగా అంబటి రాంబాబు ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్యాన్స్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నా డ్యాన్సులు వైరల్ అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే.. నా డ్యాన్స్ అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అలా చేయలేడు, ఒక్క చిరంజీవి మాత్రమే ఆలా చేయగలుగుతారు అని చెప్పారు. నిన్ను డామినేట్ చేసేది ఒక్క చిరంజీవి మాత్రమే, నీకు 66 ఏళ్ళు అయినా పవన్ కళ్యాణ్ కన్నా అద్భుతంగా డ్యాన్స్ చేసావని నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఫోన్స్ చేసి మరీ చెప్పారు అని తెలిపారు. దీంతో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
"నా dance చూసి cinema Field వాళ్ళు Phone చేసి ఇలాంటి డాన్స్ #Chiranjeevi మాత్రమే వెయ్యగలడు అన్నారు" – #AmbatiRambabu
Full interview – https://t.co/XuP9SN3Zma pic.twitter.com/dYH9nUfljn
— Daily Culture (@DailyCultureYT) April 2, 2024