Rajinikanth-RGV: రజినీకాంత్ అసలు హీరోనే కాదు.. స్లో మోషన్ షాట్స్ లేకపోతే జీరోనే.. ఆయనకన్నా..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Rajinikanth-RGV) ఎం చేసినా వివాదమే. అసలు వివాదాలు అవడానికి మాట్లాడతారా.. లేక ఆయన మాట్లాడాక వివాదాం అవుతాయా అర్థంకాదు.

Rajinikanth-RGV: రజినీకాంత్ అసలు హీరోనే కాదు.. స్లో మోషన్ షాట్స్ లేకపోతే జీరోనే.. ఆయనకన్నా..

Director Ram Gopal Varma sensational comments on Rajinikanth

Updated On : November 25, 2025 / 1:38 PM IST

Rajinikanth-RGV: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎం చేసినా వివాదమే. అసలు వివాదాలు అవడానికి మాట్లాడతారా.. లేక ఆయన మాట్లాడాక వివాదాం అవుతాయా అర్థంకాదు. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వర్మ మీడియాకి మాత్రం ఎప్పుడు దగ్గరంగానే ఉంటూ ఉంటాడు. తన మాటలతో, తన ట్వీట్ లతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి తన టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ(Rajinikanth-RGV). ఇటీవల ఆయన మొదటి సినిమా శివ రీ రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి మళ్ళీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఐబొమ్మ రవి అరెస్ట్ పై, రాజమౌళి వివాదం గురించి కూడా స్పందించాడు. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచాడు.

Tripti Dimri: స్పిరిట్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. చీరలో సింగారం అదుర్స్.. ఫోటోలు

అలాగే చిరంజీవి, బాలకృష్ణపై కూడా ఒక రేంజ్ లో కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేశాడు. ఆయనకు స్టార్ హీరో అయ్యే లక్షణాలు లేవని చెప్పాడు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే బయట కనబడు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..”స్లో మోషన్ షాట్స్ లేకపోతే అసలు రజినీకాంత్ స్టార్ హీరో అయ్యుండేవాడు కాదు. స్లో మోషన్స్ షాట్స్ ని ఆయన వాడినట్టుగా ప్రపంచంలో ఎవరు వాడారు” అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీంతో వర్మ చేసిన ఈ కామెంట్స్ కాస్త వివాదానికి దారి తీశాయి. తమిళ స్టార్ హీరో, కోట్లాది మంది అభిమానించే వ్యక్తిని పట్టుకొని అలాంటి కామెంట్స్ చేస్తావా అంటూ వర్మపై ఫైర్ అవుతున్నారు రజనీ ఫ్యాన్స్. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేదా అనేది చూడాలి.