అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ : కరోనా భయం లేకుండా మూతి ముద్దులతో మంటెక్కించారుగా!

ప్రియుడు, ముంబైకు చెందిన సింగర్‌ భవ్నీందర్‌ సింగ్‌‌‌ను పెళ్లాడిన అమాలాపాల్..

  • Publish Date - March 20, 2020 / 11:53 AM IST

ప్రియుడు, ముంబైకు చెందిన సింగర్‌ భవ్నీందర్‌ సింగ్‌‌‌ను పెళ్లాడిన అమాలాపాల్..

కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచం గజగజ వణుకుతుంటే.. అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరీర్ మాంచి ఊపు మీద ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్‌ను పెళ్లాడి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది కొద్దిరోజుల తర్వాత వీళ్లిద్దరు తమ రిలేషన్‌ను కట్టి కబోర్డ్‌లో పడేశారు.

ఎవరికి వాళ్లు సినిమాలతో బిజీ అయిపోయారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్న చందాన కేరళ కుట్టి అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ప్రియుడు ఎవరనేది సస్పెన్స్‌లో పెట్టి, ఇటీవలే ముంబై సింగర్‌ భవ్నీందర్‌ సింగ్‌‌తో లోతెంతో తెలియనంత ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. వీళ్లిద్దరూ సహజీవనం చేశారని కూడా వార్తలొచ్చాయి. (చేస్తే మాత్రం పైకి చెప్తారా.. చెప్పాలని రూల్ ఏమైనా ఉందా)..

తాజాగా అమలాపాల్ తన ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరిరువురూ ఒక్కటయ్యారు. పంజాబీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా తీసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎవరికీ భయపడక్కర్లేదు అన్నట్టు మూతి ముద్దులతో మంటెక్కించారు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో (రీల్ అండ్ రియల్ లైఫ్) అమాలాకు అంతా మంచే జరగాలని కోరుకుందాం..