Amardeep ask Nagarjuna sweater in telugu Bigg Boss 7
Bigg Boss 7 : బిగ్‌బాస్ 14వ వారం కూడా పూర్తయింది. శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది. ఈ వారంతో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. కాగా 14వ వారం వీకెండ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ అందరిపై ఫైర్ అయిన నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో కూల్ అయిపోయి కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా ఎంటర్టైన్ చేశారు. కాగా ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున పసుపు రంగు స్వెటర్ ధరించి హ్యాండ్సమ్ గా కనిపించారు.
ఆదివారం ఎపిసోడ్ లో అమర్‌దీప్.. ఆ స్వెటర్ తనకి బహుమతిగా ఇవ్వమంటూ నాగార్జునను కోరాడు. కానీ నాగార్జున నిరాకరిస్తూ.. “నువ్వు కూర్చో” అంటూ సీరియస్ సమాధానం ఇచ్చారు. ఇక ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో చూసిన కొంతమంది నెటిజెన్స్.. అసలు ఆ స్వెటర్ ధర ఎంత ఉంటుందో అని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ స్వెటర్ ధర ఎంతో కనిపెట్టేశారు. భారత రూపీ ప్రకారం ఆ స్వెటర్ ధర అక్షరాలా రెండు లక్షల పైనే ఉంది.
Also read : Chandrabose : కేన్స్ ఫెస్టివల్‌కి చంద్రబోస్ ‘ఆస్కార్ చల్లగరిగ’.. నాటు నాటు ప్రయాణంతో..
Emotional damage #Amardeep ki
Dentlo kuda begging entra ??#BiggBossTelugu7 #BiggBossTelugu #BiggBoss7Telugu pic.twitter.com/xICcm1H0Fx— ??????? ???? ? (@RajuRaj33536797) December 10, 2023
ఈ ధర చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక కొంతమంది ఏమో.. బహుశా నాగార్జున అందుకే ఇవ్వడానికి నిరాకరించి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్వెటర్ కి సంబంధించిన వీడియో, ధర నెట్టింట వైరల్ గా మారాయి. కాగా శోభా ఎలిమినేట్ అవ్వడంతో హౌస్‌లో ప్రియాంక, అమర్, శివాజీ, ప్రశాంత్, అర్జున్, యావర్ మిగిలారు. ఎప్పుడు ఫైనల్ కి అయిదుగురు మాత్రమే ఉంటారు. కానీ ఈ సారి ఆరుగురిని ఫైనల్ కి ఉంచారు. మరి వీరిలో మధ్యలో ఎవర్ని ఎలిమినేట్ చేస్తారో, వీరిలో ఎవరు బిగ్‌బాస్ కప్పు కొడతారో చూడాలి.