Chandrabose : కేన్స్‌ ఫెస్టివల్‌కి చంద్రబోస్ ‘ఆస్కార్‌ చల్లగరిగ’.. నాటు నాటు ప్రయాణంతో..

ఆస్కార్ తో పాటు పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న చంద్రబోస్ నాటు నాటు ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Chandrabose : కేన్స్‌ ఫెస్టివల్‌కి చంద్రబోస్ ‘ఆస్కార్‌ చల్లగరిగ’.. నాటు నాటు ప్రయాణంతో..

Chandrabose Oscar challagariga documentary is selected for cannes film festival

Updated On : December 11, 2023 / 8:41 PM IST

Chandrabose : టాలీవుడ్ గేయ రచయిత చంద్రబోస్‌.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి లిరిక్స్ అందించి.. ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. కీరవాణితో పాటు ఆస్కార్ ని అందుకొని తెలుగు సంగీతం, సాహిత్యాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా చేశారు. ఆస్కార్ తో పాటు పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న చంద్రబోస్ నాటు నాటు ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్కార్ అందుకొని తిరిగి వచ్చిన చంద్రబోస్ కి తెలుగు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు.

ఆయన ఆస్కార్ గెలుచుకోవడం ప్రతి తెలుగు వ్యక్తికి చాలా గర్వంగా ఉంది. మరి ఆయన సొంత ఊరి ప్రజలు ఇంకెంత గర్వంగా ఫీల్ అయ్యి ఉంటారు. ఈ విషయానే చిల్కూరి సుశీల్‌రావు ఒక డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించారు. చంద్రబోస్‌ సొంత ఊరు జయశంకర్‌ జిల్లాలోని చల్లగరిగ. ఆస్కార్ గెలుచుకున్న తరువాత చంద్రబోస్ అక్కడి వెళ్ళినప్పుడు జరిగిన సంబరాలు, అనుభూతులని.. ‘ఆస్కార్‌ చల్లగరిగ’ అనే డాక్యుమెంటరీగా చిల్కూరి సుశీల్‌రావు దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఇక ఈ డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లో నిర్వహించే ప్రఖ్యాత కేన్స్‌ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది.

Also read : Kalyan Ram : ‘డెవిల్’ సినిమా కోసం అప్పటి కాలానివి.. ఏకంగా 90 రకాల డ్రెసులు..

అయితే ఇది ఏడాదికి ఒకసారి నిర్వహించే ఫిలిం ఫెస్టివల్ కాదు. కేన్స్‌లో ఏడాది ఒకసారితో పాటు నెలకి ఒకసారి కూడా ఒక ఫెస్టివల్ ని నిర్వహిస్తారు. ఇక డిసెంబరు నెలకు గాను ‘ఆస్కార్‌ చల్లగరిగ’ ని ఎంపిక చేశారు. దీంతో మరోసారి నాటు నాటు ప్రయాణం ఇంటర్నేషనల్ లెవెల్ లో వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా ముంబైలో నిర్వహించిన షార్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో కూడా ఈ డాక్యుమెంటరీ అవార్డుని గెలుచుకుంది.