Ambati Rambabu : బ్రో సినిమాలో అంబటి క్యారెక్టర్.. సినిమాపై సెటైర్స్ వేసిన మంత్రి అంబటి..

బ్రో మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ ‘శ్యాంబాబు’ అనే పాత్రని పోషించాడు. ఒక నిమిషం పాటు ఈ శ్యాంబాబు కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ అని అర్ధమవుతుంది.

Ambati Rambabu satirical comments on Bro Movie and Pawan Kalyan

Ambati Rambabu :  ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్(Sai Dharam Tej) క‌లిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా నిన్న జులై 28న గ్రాండ్ గా రిలీజయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని(Samuthirakani) ద‌ర్శ‌కత్వంలో వచ్చిన బ్రో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కి కోసం స్పెషల్ ఎలిమెంట్స్ జోడించారు. జనసేనకు సింక్ అయ్యేలా కూడా ఓ రెండు సీన్స్ పెట్టారు. దీంతో ఇవి వైరల్ గా మారాయి.

అయితే బ్రో మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ ‘శ్యాంబాబు’ అనే పాత్రని పోషించాడు. ఒక నిమిషం పాటు ఈ శ్యాంబాబు కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ అని అర్ధమవుతుంది. గతంలో సంక్రాంతికి అంబటి రాంబాబు బయట రోడ్డు మీద డ్యాన్స్ వేస్తాడు. అదే డ్యాన్స్, అదే డ్రెస్ వేయించి పృథ్వీతో సినిమాలో చేయించారు. పవన్ ఆ క్యారెక్టర్ ని డ్యాన్స్ కూడా రాదా అంటూ తిడతాడు. దీంతో అంబటి డ్యాన్స్ వీడియో, పృద్వి వీడియో లింక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. ఈ మూవీలో శ్యాంబాబుగా అంబటి రాంబాబు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

ఈ సీన్ అంబటి రాంబాబు దాకా వెళ్లడంతో మొదట.. గెలిచినోడిది సంకురాత్రి డ్యాన్స్, ఓడినోడిది కాళరాత్రి డ్యాన్స్ అని ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేశారు. అది సరిపోదన్నట్టు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంశంపై, బ్రో సినిమాపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు.

Bro Collections : ‘బ్రో’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? హిట్ టాక్ తో అదరగొట్టిన మామా అల్లుళ్ళు..

మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే సినిమాల్లో నా క్యారక్టర్ పెట్టి పవన్ కళ్యాణ్ శునకానందం పొందుతున్నాడు. నేను డాన్స్ వేసిన మాట వాస్తవమే. సంక్రాంతి రోజున సరదాగా ఆనంద తాండవం చేస్తా. నా డ్యాన్స్ సింక్ కాలేదంట, నేనేమీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాదు. డబ్బులు తీసుకొని డ్యాన్స్ చేయలేదు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ వేస్తారు పవన్ కళ్యాణ్. బ్రో సినిమా అటూ ఇటూ కానిది. ప్రాక్టికల్ గా నన్ను ఏమీ చేయలేక ఇలా సినిమాల్లో నా క్యారెక్టర్ పెట్టి తిట్టుకొంటున్నాడు. ఇంట్లో బొమ్మ చేసుకొని డిష్యూం.. డిష్యూం అని కొడుతూ, తుపాకీతో డిష్.. డిష్ అని కాల్చుతూ ఉంటాడు. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ గెలిచినోడి డ్యాన్స్. గతంలో డ్యాన్స్ చేశాను, భవిష్యత్ లో కూడా చేస్తాను. పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి నా డ్యాన్స్ చూడొచ్చు కావాలంటే అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు