Selena Gomez : నేను పిల్లల్ని కనలేను.. ఎమోషనల్ అయిన స్టార్ సింగర్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది సెలీనా గోమెజ్.
- Saketh U
- Published On : September 11, 2024 / 07:04 AM IST
American Star Singer Selena Gomez says about her Medical Complications
Selena Gomez : అమెరికన్ స్టార్ పాప్ సింగర్ సెలీనా గోమెజ్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సాంగ్స్ తో ప్రపంచ ప్రేక్షకులని మెప్పించింది. అమెరికాలోనే కాక వరల్డ్ వైడ్ కూడా స్టార్ సింగర్ సెలీనా గోమెజ్. గతంలో స్టార్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి బ్రేకప్ కూడా అయింది ఈ భామకు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
సెలీనా గోమెజ్ మాట్లాడుతూ.. నేను పలు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాను. నేను అసలు పిల్లల్ని కనలేను. దాని వల్ల నాకు, నా బిడ్డకు కూడా ప్రమాదం. ఆ విషయంలో నేను బాధపడుతున్నాను. ఎవర్నైనా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయింది. అయితే అసలు తన ఆరోగ్య సమస్య ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు. దీంతో సెలీనా గోమెజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Rana Daggubati : షారుఖ్, కరణ్ జోహార్ కాళ్ళకు నమస్కరించిన రానా.. వీడియోలు వైరల్..
సెలీనా గోమెజ్ ఎప్పట్నుంచో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. గతంలో ఆమెకు కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ప్రస్తుతం సెలీనా ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుంది. దీని వల్ల ఆమె శరీరంలోని రోగనిరోధక శక్తి నశించడమే కాకుండా శరీరంలోని పలు అవయవాల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ విషయం తెలిసి ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న అభిమానులు బాధపడుతున్నారు.
