Kaun Banega Crorepati: పనిలేకనే కేబీసీ ఒప్పుకున్నా.. అమితాబ్ కన్నీళ్లు!
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది మెగాస్టార్ అమితాబ్ ప్రతిరూపం.. వినిపించేది ఆయన గంభీరమైన స్వరమే. కేబీసీ గేమ్ షో ఇప్పటికే 12 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి..
- Naresh Mannam
- Published On : December 5, 2021 / 11:21 AM IST
Kaun Banega Crorepati
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది మెగాస్టార్ అమితాబ్ ప్రతిరూపం.. వినిపించేది ఆయన గంభీరమైన స్వరమే. కేబీసీ గేమ్ షో ఇప్పటికే 12 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోగా ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తుంది. ఈ షో ఈ స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి అమితాబ్ బచ్చన్ హోస్టింగే కారణమనేదానికి దేశవ్యాప్తంగా ఏ అభిమాని మొహమాటపడరు. ప్రపంచ వ్యాప్తంగా120 దేశాల్లో విజయవంతమైన ఈ షో అమితాబ్ చేతితో మొదలై ఇండియాలో ఇప్పుడు పలు భారతీయ భాషల్లో సక్సెస్ ఫుల్ గా సీజన్ల మీద సీజన్లు నడుస్తుంది.
Giribabu: విచిత్ర కథ పుస్తకం.. చిరు, మోహన్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగులో కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా మూడు సీజన్లు.. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఒక సీజన్ నిర్వహించగా ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. అయితే.. మిగతా అన్ని భాషలు ఒక ఎత్తు కాగా కౌన్ బనేగా కరోడ్ పతి మాత్రం ఇంకో ఎత్తు. 13 సీజన్లు నిర్విరామంగా నడవడమే కాకుండా అసలు ఈ షో మొదలు పెట్టే సమయంలో అమితాబ్ లాంటి ఒక స్టార్ ఇలాంటి షో హోస్ట్ చేయడం కూడా చాలా డేరింగ్ స్టెప్ గా అభివర్ణించవచ్చు.
Anchor Ravi: ఆ రూ.45 లక్షలు.. మోసపోయిన రవికి అదే బాధ!
కేబీసీ 13వ సీజన్ లో లేటెస్టుగా వచ్చిన ఒక ఎపిసోడ్ లో అమితాబ్ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. 1000వ ఎపిసోడ్ లో స్పెషల్ గా ఉండాలని భావించిన నిర్వాహకులు దీనికి అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నందాను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేబీసీలో బిగ్ బీ జర్నీని గుర్తు చేస్తూ నిర్వాహకులు ఓ స్పెషల్ వీడియోని ప్లే చేయగా ఇది చూసి అమితాబ్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.
Tollywood New Releases: అఖండ ఊపు.. ఇక బాక్సాఫీస్‌పై టాలీవుడ్ యుద్ధమే!
ఈ సందర్భంగా మాట్లాడిన అమితాబ్.. తాను కేబీసీకి సైన్ చేసే సమయంలో.. బిగ్ స్క్రీన్ మీద నటించిన స్టార్స్.. స్మాల్ స్క్రీన్ మీదకు వస్తే ఇమేజ్ తగ్గిపోతుందని అందరూ అన్నారని.. కానీ ఆ సమయంలో తనకు పెద్దగా పని లేదని.. ఎవరూ తనకు సినిమా అవకాశాలు ఇవ్వకపోవడంతో తాను ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో చేయడానికి అంగీకరించానని.. కానీ, ఇలా ఇన్ని సీజన్లు ఇంత సక్సెస్ ఫుల్ గా ఈ షోను ఆదరిస్తారని అనుకోలేదని బిగ్ బీ ఎమోషనల్ అయ్యారు.
