Amitabh Bachchan : ప్రాజెక్ట్ k సినిమాపై స్పెషల్ ట్వీట్ చేసిన అమితాబ్.. ఇంత పెద్ద సినిమా అని నేను అనుకోలేదు..

ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు.

Amitabh Bachchan special tweet on Project K Movie

Project K Movie :  రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా అనేకమంది స్టార్స్, మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ అంచనాలని పెంచుతూ చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో కామిక్ కాన్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనే మొదటి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. దీంతో చిత్రయూనిట్ చాలా గర్వంగా ఉంది అంటూ దీని గురించి షేర్ చేసింది.

Naga Shaurya : నాగశౌర్య ఆ గేమ్‌లో నేషనల్ ప్లేయర్ తెలుసా? ఇంటర్నేషనల్స్ కి కూడా ట్రై చేశాడు కానీ..

ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో.. చాలా గర్వించదగ్గ విషయం నాకు. నేను ఇన్ని రోజులు ఈ సినిమా ఇంత పెద్దది, ఇంత ముఖ్యమైనది అనుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసింది. వైజయంతి మూవీస్, డైరెక్టర్ నాగ్ సర్ కి, మొత్తం యూనిట్ కి నా మీద చూపించిన ప్రేమకు చాలా ధన్యవాదాలు. ఇంత గొప్ప సినిమాలో నేను భాగం అవ్వడం మర్చిపోలేని అనుభవం అని ట్వీట్ చేశారు అమితాబ్. దీంతో అమితాబ్ ఈ రేంజ్ లో ప్రాజెక్ట్ K సినిమా గురించి ట్వీట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు పొంగిపోతూ ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు