Amitabh Bachchan Twitter account got Hacked by Prabhas Fans Shares so many Unnecessary posts Rumours goes Viral
Prabhas – Amitabh : ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇప్పటికే ఆల్మోస్ట్ 950 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. చాలా చోట్ల కల్కి సరికొత్త రికార్డులని సృష్టించింది. ఇక నాగ్ అశ్విన్ పై దేశవ్యాప్తంగా పొగడ్తల వర్షం కురుస్తుంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు.
అయితే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం కల్కి సినిమా ఇప్పటికే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం. దీంతో కల్కి అనేక సినిమాల రికార్డులని తక్కువ టైంలో దాటేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అమితాబ్ రోజూ ఒక్క ట్వీట్ అయినా వేస్తారు.
Also Read : Rajinikanth : అనంత్ అంబానీ పెళ్ళిలో.. సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యాన్స్ చూశారా?
అమితాబ్ ఎక్కువగా అభిషేక్ బచ్చన్ ని ఎవరైనా పొగుడుతూ వేసే ట్వీట్స్ ని రీ ట్వీట్ చేస్తూ ఉంటారు. తన సినిమాల గురించి కూడా అధికారికంగానే ట్వీట్స్ వేస్తారు. అయితే ఇవాళ ఉదయం నుంచి అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ లో కల్కి సినిమాకు సంబంధించి మాములు నెటిజన్స్ వేసిన పోస్టులు, ప్రభాస్ ని పొగుడుతూ వేసే అభిమానుల పోస్టులు వరుసగా రీ ట్వీట్ చేస్తున్నారు. అసలు అమితాబ్ గురించి లేని కల్కి పోస్టులు కూడా రీ ట్వీట్ చేస్తున్నారు. అసలు అమితాబ్ ని ట్యాగ్ చేయకపోయినా, కనీసం అమితాబ్ హ్యాష్ ట్యాగ్ లేని ప్రభాస్ ని పొగుడుతూ ఉన్న పోస్టులు కూడా షేర్ చేయడం గమనార్హం.
!!!!! ❤️ https://t.co/umTXCEQ4zO
— Amitabh Bachchan (@SrBachchan) July 12, 2024
సాధారణంగా అమితాబ్ వేరే హీరోలని తక్కువ చేసి మాట్లాడటం, చూపించడం చేయరు. కానీ ఓ సినిమా పేజీ కల్కి సినిమా షారుఖ్ పఠాన్ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ని 15 రోజుల్లోనే బద్దలుకొట్టింది అని పోస్ట్ చేసింది. అందులో బాహుబలిలోని ఓ సీన్ తో ప్రభాస్, షారుఖ్ లని కంపేర్ చేస్తున్నట్టు ఉండే వీడియోని పోస్ట్ చేసారు. దీన్ని కూడా అమితాబ్ అకౌంట్ రీ ట్వీట్ చేసింది. అసలు కొన్ని అయితే అమితాబ్ ఎప్పుడూ అలాంటివి రీ ట్వీట్ చేయనివి కూడా ఇప్పుడు ఆయన అకౌంట్ లో దర్శనమిస్తున్నాయి. దీంతో పొద్దున్నే అమితాబ్ అకౌంట్ హ్యాక్ అయిందా అని కొంతమంది ఆ పోస్ట్ ల కింద సందేహం వ్యక్తం చేస్తుంటే అన్ని ప్రభాస్ ని పొగుడుతూ, కల్కి గురించే పోస్టులు ఉండటంతో ప్రభాస్ అభిమానులే హ్యాక్ చేశారా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి అమితాబ్ అకౌంట్ హ్యాక్ అయిందా లేక నిజంగానే అమితాబ్ ఇవన్నీ షేర్ చేస్తున్నారా తెలియాలి.
quite amazing https://t.co/5uX6S2Cenj
— Amitabh Bachchan (@SrBachchan) July 12, 2024
— Amitabh Bachchan (@SrBachchan) July 12, 2024