Rajinikanth : అనంత్ అంబానీ పెళ్ళిలో.. సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యాన్స్ చూశారా?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా డ్యాన్స్ అదరగొట్టేసారు.

Rajinikanth : అనంత్ అంబానీ పెళ్ళిలో.. సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యాన్స్ చూశారా?

Super Star Rajinikanth Dance in Anant Ambani Wedding Videos goes Viral

Updated On : July 13, 2024 / 7:11 AM IST

Rajinikanth : గత మూడు రోజులుగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్ళికి బాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్, హాలీవుడ్ నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాల నుంచి అనేకమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక నిన్నే అసలు పెళ్లి వేడుక కావడంతో మరింతమంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేసారు. స్టార్ నటీనటులంతా డ్యాన్సులు చేస్తూ ఫోటోలు దిగుతూ అభిమానులని, నెటిజన్లని ఆశ్చర్యపరిచారు.

సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ వేడుకల్లో డ్యాన్సులు వేస్తారని తెలిసిందే. యువ నటీనటులు అంటే ఫుల్ యాక్టివ్ గా డ్యాన్స్ వేస్తారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా డ్యాన్స్ అదరగొట్టేసారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు రజినీకాంత్ తన భార్య లత, కూతురుగు ఐశ్వర్య, మనవడితో కలిసి వెళ్లారు. అందరూ డ్యాన్స్ చేస్తుంటే రజినీకాంత్ కూడా అనంత్ అంబానీ, అనిల్ కపూర్, రణవీర్ సింగ్.. అక్కడ ఉన్న పలువురితో కలిసి డ్యాన్స్ వేశారు.

Also See : Celebrities at Anant Radhika Wedding : అనంత్ అంబానీ – రాధికా పెళ్లి వేడుకల్లో.. సెలబ్రిటీల ఫొటోలు..

చిన్న చిన్న స్టెప్పులతో రజినీకాంత్ అదరగొట్టేసారు. దీంతో రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలు చూసి సూపర్ స్టార్ అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నెటిజన్లు అయితే ఈ వయసులో కూడా అస్సలు తగ్గట్లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.