Project K : ప్రాజెక్ట్ K టీష‌ర్టు అందుకున్న అమితాబ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ప్రభాస్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా టీష‌ర్టులను మేకర్స్ ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీష‌ర్టును అమితాబ్ ధరించి..

Amitabh Bachchan wear Project K t shirt at his jalsa

Project K : ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని (Disha Patani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ చిత్ర యూనిట్ మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ టైటిల్ ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో జులై 20న టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

KGF : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్ సిరీస్.. RRR ని బీట్ చేస్తుందా..? సలార్ కోసమే రిలీజ్..?

దీంతో అభిమానులంతా ఆ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో శనివారం (జులై 8) ఒక స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K అని రాసి ఉన్న టీష‌ర్టును ఫ్రీగా అందజేసి అభిమానులను ఖుషీ చేసింది. ఒక ప్రత్యేక లింక్ ఇచ్చి దాని ద్వారా రిజిస్టర్ అయ్యి టీష‌ర్టుని సొంత చేసుకునేలా అవకాశం కలిపించారు మేకర్స్. శనివారం ఫ‌స్ట్ బ్యాచ్‌కు సంబంధించిన టీ ష‌ర్టులు అందుబాటులోకి తీసుకు రాగా అవన్నీ కేవలం నాలుగు నిమిషాల్లో అయ్యిపోయాయి. ఇక ఈ టీష‌ర్టును అమితాబ్ కూడా అందుకున్నారు.

Leo : లియోకి గుమ్మడికాయ కొట్టేసిన విజయ్.. టీజర్ అండ్ సాంగ్స్‌తో ప్రమోషన్..

ప్రతి ఆదివారం అమితాబ్ తన ఇంటి వద్ద అభిమానులను కలుసుకునే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక అభిమానులను అమితాబ్ ప్రాజెక్ట్ టీష‌ర్టు ధరించి కలుసుకున్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా నేడు (జులై 10) మరికొన్ని టీష‌ర్టులను అభిమానులు కోసం తీసుకురాగా అవి కూడా వేగంగా సేల్ అయ్యిపోయాయి. అయితే మొదటి టీష‌ర్టుకు ఇప్పటి టీష‌ర్టులకు కొంచెం తేడా ఉంది. మొదటి టీష‌ర్టులో ‘What is Project K’ అని రెండు చేతులు బొమ్మ ఉంటే, సెకండ్ టైం టీష‌ర్టుల్లో ‘The Rise’ అని ఉండి ఒక వ్యక్తి బొమ్మ ఉంది.