Project K : ప్రభాస్‌తో పని చేయడం నాకు గౌరవం.. ప్రభాస్‌పై అమితాబ్ ట్వీట్..

తాజాగా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం 'ప్రాజెక్టు K' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో అమితాబ్, ప్రభాస్ కలిసి ఉన్న సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. అయితే అమితాబ్......

Project K :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా అమితాబ్ ముఖ్యపాత్రలో “ప్రాజెక్ట్ K” అనే భారీ సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఫాంటసి థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ ని ఈ సినిమా పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లో దీపికా, ప్రభాస్ పై ఉన్న సన్నివేశాలని షూట్ చేశారు. తాజాగా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం ‘ప్రాజెక్టు K’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో అమితాబ్, ప్రభాస్ కలిసి ఉన్న సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. అయితే అమితాబ్, ప్రభాస్ కలిసి మొదటి సారి పనిచేయటంతో ఒకరిపై ఒకరు ప్రశంశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ పోస్టులు వైరల్ గా మారాయి.

Chiranjeevi : 24 గంటల్లో చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్

అమితాబ్ ప్రభాస్ గురించి చెప్తూ.. ”ఫస్ట్ డే, ఫస్ట్ షాట్, ఫస్ట్ టైం బాహుబలి ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా అనిపించింది. అతని ట్యాలెంట్ అమోఘమైనది. అతని నుంచి చాలా నేర్చుకోవచ్చు” అని ప్రభాస్ పై పొగుడుతూ ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ట్వీట్ ని బాగా వైరల్ చేస్తున్నారు.

Arjun Rampal : సహజీవనంతో పిల్లలు.. పెళ్లి మాత్రం వద్దు అంటున్న బాలీవుడ్ నటుడు

ఇక ప్రభాస్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో అమితాబ్ ఫోటో షేర్ చేసి.. ”నా చిరకాల కల నెరవేరింది. లెజెండరీ అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ షాట్ లో యాక్ట్ చెయ్యడం జరిగింది” అని చాలా ఎగ్జైటింగ్ గా పోస్ట్ చేసాడు. ఇలా ఒకరిపై ఒకరు పోస్టులు చేయడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు