మహేష్ హీరోయిన్ తల్లి కాబోతుంది!

  • Publish Date - October 13, 2020 / 08:50 PM IST

Amrita Rao baby bump: అనుష్క శర్మ, ‘నువ్వు నేను’ ఫేం అనిత తాము తల్లి కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా వారి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ గర్భంతో ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆమె మరెవరో కాదు.. సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘అతిధి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన Amrita Rao.


ఈ మూవీతో తెలుగులో గుర్తింపు వచ్చినా కానీ మరో సినిమాలో నటించలేదామె. తిరిగి తన సొంత గూటికి (బాలీవుడ్) చేరుకుంది. హిందీలో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న అమృత 2013 వ‌ర‌కు సినిమాలు చేసింది. 2016లో RJ Anmol ని వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి సినిమాల‌ు తగ్గించేసింది. గతేడాది బాల్ థాక్రే జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ‘థాక్రే’ మూవీలో స‌వాజుద్దీన్ సిద్ధిఖీకి భార్యగా క‌నిపించింది.


పూర్తి స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తున్న అమృత ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. చాలా మంది హీరోయిన్‌లు తాము గర్భందాల్చిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే.. అమృత మాత్రం స్పందించలేదు. అయితే ఆమె ముంబైలోని ఒక క్లినిక్ నుంచి బ‌య‌టకివస్తూ బేబీ బంప్‌తో కనిపించింది. అక్కడున్న వారు ఫొటోలు తీయడంతో అమృత గర్భవతి అనే విషయం అందరికీ తెలిసింది.