×
Ad

Amy Jackson : ఇండియా గేట్ ముందు పబ్లిక్‌గా బాయ్ ఫ్రెండ్‌కి లిప్‌కిస్ పెట్టిన అమీ జాక్సన్.. పబ్లిక్‌లో ఇవేం పనులంటూ విమర్శలు…

తాజాగా తన ప్రియుడితో కలిసి ఇండియా టూర్ కి వచ్చింది అమీ. ఇండియా టూర్ ఎంజాయ్ చేస్తున్న అమీ తాజాగా ముంబైలోని ఇండియా గేట్ వద్దకు వెళ్ళింది తన ప్రియుడితో కలిసి.

  • Published On : July 23, 2023 / 08:07 PM IST

Amy Jackson lip kiss with his boyfriend Ed Westwick in Public Place at Gate Way of India Mumbai goes viral

Amy Jackson :  బ్రిటన్ భామ హీరోయిన్ అమీ జాక్సన్ ఇండియన్ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంది. తమిళ్ లో మదరాసి పట్టణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఎవడు సినిమాతో పలకరించింది. ఐ, రోబో 2, తేరి, అభినేత్రి.. లాంటి పలు సినిమాలతో ఇండియన్ ప్రేక్షకులని మెప్పించింది. రోబో సినిమా తర్వాత దాదాపు 5 ఏళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అమీ.

ఈ గ్యాప్ లో బ్రిటన్ బిజినెస్ మ్యాన్ జార్జ్ పనయిటౌతో డేటింగ్ చేసి ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత అతనితో విడిపోయి ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌ విక్ అనే ఇంగ్లీష్ నటుడితో డేటింగ్ లో ఉంది. తాజాగా తన ప్రియుడితో కలిసి ఇండియా టూర్ కి వచ్చింది అమీ. ఇండియా టూర్ ఎంజాయ్ చేస్తున్న అమీ తాజాగా ముంబైలోని ఇండియా గేట్ వద్దకు వెళ్ళింది తన ప్రియుడితో కలిసి.

Baby 9 Days Collections : కలెక్షన్లలో ‘బేబీ’ జోరు.. 9 రోజుల్లోనే ఇన్ని కోట్లా?

ఇండియా గేట్ వద్ద తన ప్రియుడికి లిప్ కిస్ ఇస్తూ ఫోటోలు తీసుకుంది. ఇక ఆ ఫోటోలు అమీ ప్రియుడు ఎడ్వర్డ్ జాక్ పీటర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. పబ్లిక్ ప్లేస్ లో అలా లిప్ కిస్ ఇచ్చుకోవడంతో అక్కడ చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి పనులేంటి అంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. పలువురు అమీ జాక్సన్, ఎడ్వర్డ్ జాక్ పీటర్ పైన ఇలాంటివి ఇండియాలో పబ్లిక్ గా చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.