×
Ad

Baby Movie : సూపర్ హిట్ ‘బేబీ’ మళ్ళీ రిలీజ్.. మరిన్ని సీన్స్, ఒక సాంగ్ యాడ్ చేసి.. 25 డేస్ సెలబ్రేషన్స్..

‘బేబీ’ సినిమా రిలీజయి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు, ప్రేక్షకులకు మరో స్పెషల్ న్యూస్ తెలిపింది చిత్రయూనిట్.

  • Published On : August 6, 2023 / 07:20 AM IST

Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie Releasing with some more Scenes and one Song adds to Movie

Baby Movie : సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరీ అభినందించారు.

ఈ సినిమా రిలీజయి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో సినిమా అభిమానులకు, ప్రేక్షకులకు మరో స్పెషల్ న్యూస్ తెలిపింది చిత్రయూనిట్. నేటి నుంచి థియేటర్స్ లో సినిమాకు ఎడిటింగ్ లో తీసేసిన మరిన్ని సన్నివేశాలు, ఒక సాంగ్ కూడా జత చేసి మళ్ళీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. నేడు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో యాడ్ చేసిన సన్నివేశాలతో సాయంత్రం ఫస్ట్ షో వేసి అనంతరం అన్ని చోట్ల రిలీజ్ చేయనున్నారు.

Sarkaaru Noukari : రాఘవేంద్రరావు నిర్మాతగా.. సింగర్ సునీత కొడుకు హీరోగా సినిమా.. టీజర్ చూశారా?

దీనిపై అభిమానులు, సినిమా లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బేబీ సినిమా రిలీజయి 25 రోజులు అవుతున్నా ఇంకా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. చిత్రయూనిట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తూ బిజీగా ఉంది.