Sarkaaru Noukari : రాఘవేంద్రరావు నిర్మాతగా.. సింగర్ సునీత కొడుకు హీరోగా సినిమా.. టీజర్ చూశారా?

సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో 'సర్కారు నౌకరి' సినిమా తెరకెక్కుతుంది.

Sarkaaru Noukari : రాఘవేంద్రరావు నిర్మాతగా.. సింగర్ సునీత కొడుకు హీరోగా సినిమా.. టీజర్ చూశారా?

Singer Sunitha Son Akash Introducing as Hero with Sarkaaru Noukari Movie under Raghavendra Rao Production Teaser Released

Updated On : August 6, 2023 / 6:59 AM IST

Sarkaaru Noukari Movie Teaser : టాలీవుడ్(Tollywood) పాపులర్, సీనియర్ సింగర్ సునీత(Singer Sunitha) ఉపద్రష్ట తన మెలోడీ పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. కొన్ని వందల పాటలతో సంగీత ప్రియుల మనసులని గెలుచుకుంది. సునీత ఇప్పుడు కూడా పలు పాటలు పాడుతూ, పలు టీవీ షోలలో మెప్పిస్తుంది. ఇక సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. సునీత తనయుడు ఆకాష్(Akash) ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు.

సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ సినిమా తెరకెక్కుతుంది. రాఘవేంద్రరావు బ్యానర్ RK టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజయింది. 1996లో కొల్లాపూర్ వద్ద జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు చిత్రయూనిట్ తెలిపారు.

Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా? బాబుని చూశారా?

దీంతో సర్కారీ నౌకరి సినిమా పీరియాడిక్ సినిమా అని తెలుస్తుంది. హీరో గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయి కాగా ఓ పల్లెటూళ్ళో అతనికి ఉద్యోగం వస్తే, అతనికి పెళ్లి ఫిక్స్ అయితే ఏం జరిగింది అనే పాయింట్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్ పర్వాలేదనిపించింది. మరి సింగర్ గా టాప్ పొజిషన్ కి వెళ్లిన సునీత పేరుని ఆమె కొడుకు ఆకాష్ హీరోగా ఏ మేరకు నిలబెడతాడో చూడాలి.