Anand Deverakonda and Vaishnavi chaitanya new movie in Sithara Entertainments
Anand Devarakonda- Vaishnavi Chaitanya : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం పట్టాలెక్కనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈవీవీ విన్‌లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న #90’s (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హాసన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తమ నిర్మాణ సంస్థలో 32వ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు వెల్లడించింది.
ఇది ఓ మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ అని, అందరిని ఆకట్టుకుంటుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పింది. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది.
90’s సిరీస్‌లో చిన్నపిల్లవాడు అయిన ఆదిత్య పది సంవత్సరాల తరువాత పెద్దవాడు అయితే.. ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే అతడికి అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా వీడియోలో చూపించారు.
Tollywood directors : ఒకే దారిలో ఆ ముగ్గురు డైరెక్టర్లు.. ఇలా ఉంటే కష్టమే..!
మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ. అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది