Baby Movie : 50 డేస్ పూర్తి చేసుకున్న బేబీ.. 100 మిల్లియన్ వ్యూస్.. 100 కోట్లకు..!

ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ మూవీ..

Anand Deverakonda Vaishnavi Chaitanya Viraj Ashwin Baby Movie records

Baby Movie : కలర్ ఫొటోతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకనిర్మాత సాయి రాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేసిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘బేబీ’. శ్రీనివాస కుమార్ (SKN) నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రలు పోషించారు. ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

Kushi OTT : ఖుషి ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఆ రోజేనా..?

ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా సెలబ్రిటీస్ ప్రశంసలు కూడా తెచ్చి పెట్టింది. ఇక కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టించింది. ఇటీవలే 90 కోట్ల‌ మార్క్ ని కూడా దాటేసిన ఈ చిత్రం.. 100 కోట్లకు చాలా దగ్గరిలో ఉంది. ఇక ఆగస్టు 25 నుంచి ఓటీటీలో కూడా షో మొదలు పెట్టింది. అక్కడ కూడా రికార్డ్స్ సెట్ చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహాలోకి వచ్చిన 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది. కాగా ఓటీటీకి వచ్చేసినా.. థియేటర్స్ లో మాత్రం ఇంకా షోలు పడుతూనే ఉన్నాయి.

Pawan Kalyan : పవన్ బర్త్ డేకి రెడీ అవుతున్న గిఫ్ట్స్.. ఏ సినిమా నుంచి ఏ అప్డేట్..?

తాజాగా ఈ చిత్రం 50 రోజులు మైలు రాయిని చేరుకుంది. రెండు మూడు వారలు మాత్రమే థియేటర్స్ లో సినిమాలు సందడి చేస్తున్న తరుణంలో ఒక చిన్న సినిమా 50 రోజులు పండుగా చేసుకోవడం విశేషం. కడప, కర్నూలు, అనకాపల్లి లాంటి చోట్ల ఈ చిత్రం డైరెక్ట్ 50 రోజులు రన్ పూర్తి చేసుకుంది. ఇలా 100 కోట్లు కలెక్షన్స్, 100 మిలియన్ వ్యూస్, 50 రోజులు పండుగాతో మూవీ టీం ఫుల్ హ్యాపీగా ఉంది. దర్శకుడు సాయి రాజేష్ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా థాంక్యూ చెప్పాడు. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ కి మీరు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు.