Rekha Vedavyas : నన్ను పెళ్లి చేసుకోవాలంటే మెసేజ్ చేయండి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ పెళ్లి, ప్రేమ గురించి అడగడంతో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ 40 ఏళ్ళ భామ. (Rekha Vedavyas)
- Saketh U
- Updated on- June 25, 2026 / 09:05 PM IST
Rekha Vedavyas
Rekha Vedavyas : ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రేఖ వేదవ్యాస్. తెలుగు, కన్నడలో వరుస సినిమాలు చేసి సడెన్ గా 2014 నుంచి సినిమాలకు దూరమయింది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. గత కొన్ని రోజులుగా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ రీ ఎంట్రీకి రెడీ, అవకాశాలు ఇవ్వండి అని అంటుంది రేఖ.
ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ పెళ్లి, ప్రేమ గురించి అడగడంతో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ 40 ఏళ్ళ భామ.
Also Read : Vijay Deverakonda : రణబాలి సినిమా విషయంలో విజయ్ పై తప్పుడు వార్తలు.. స్పందించిన హీరో టీమ్..
నటి రేఖ మాట్లాడుతూ.. నేను, సల్మాన్ ఖాన్ సింగిల్ గా మిగిలిపోతామేమో ఇండియాలో. గతంలో నేను ఒకర్ని ఇష్టపడ్డాను కానీ ఈ విషయం అతనికి చెప్పలేదు. అప్పుడు సిగ్గు, చెప్తే ఏమంటారో, వర్కౌట్ అవుతుందో లేదో అని భయం అందుకే చెప్పలేదు. ఆ తర్వాత నాకు మంచి అబ్బాయి ఎవరూ దొరకట్లేదు. అందరూ మీకు ఎవరో ఉన్నారు కానీ చెప్పట్లేదు అని ప్రమోట్ చేసారు అందుకేనేమో నేను ఇంకా సింగిల్ గా ఉన్నాను. నాకు ఎవరూ లేరు.
ఈ భూమి మీద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ ఉండరు. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ మంచి అబ్బాయి కావాలి. నన్ను ప్రేమించాలి బాగా. నేను ఏమండీ అని పిలవలేను. నా వెనక పడేవాళ్ళు ఎవరైనా జెన్యూన్ గా ఉండి మంచి వాళ్ళు అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నాకు నచ్చితే కచ్చితంగా సమాధానం ఇస్తాను. లవ్ లో ఓపిక ఉండాలి. టీనేజ్ లవ్ వేరు. ఇప్పటి లవ్ వేరు. లవ్ లో ప్యూరిటీ ఉండాలి అని చెప్పుకొచ్చింది.
Also Read : Vishnu Vishal : ఆ వ్యాధితో బాధపడుతున్నాను.. అందుకే ఇలా.. హీరో పోస్ట్ వైరల్..
మరి రేఖని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకునేవాళ్లు తన సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుందా, పెళ్లి చేసుకుంటుందా, ఎవరైనా మెసేజ్ చేస్తారా చూడాలి.
