Vijay Deverakonda : రణబాలి సినిమా విషయంలో విజయ్ పై తప్పుడు వార్తలు.. స్పందించిన హీరో టీమ్..
తాజాగా మరోసారి విజయ్ దేవరకొండపై పలువురు నెటిజన్లు తప్పుడు పోస్టులు పెట్టడంతో అతని టీమ్ స్పందించింది. (Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన్, రణబాలి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు విజయ్ పై సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తూ, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండపై పలువురు నెటిజన్లు తప్పుడు పోస్టులు పెట్టడంతో అతని టీమ్ స్పందించింది.
సోషల్ మీడియాలో.. విజయ్ దేవరకొండ రణబాలి సినిమా షూటింగ్ లో ప్రొడ్యూసర్స్ కు ప్రొడక్షన్ భారం పెరిగేలా చేస్తున్నాడంటూ, విజయ్ 50, 60 మంది అసిస్టెంట్స్ కావాలని, 5-6 కార్వాన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడని, ఆయన డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. ఈ వార్తలకు పలు మీడియా సంస్థల లోగోలు, పేర్లు పెట్టి పోస్టులు చేస్తున్నారు.
Also Read : Vishnu Vishal : ఆ వ్యాధితో బాధపడుతున్నాను.. అందుకే ఇలా.. హీరో పోస్ట్ వైరల్..
దీంతో విజయ్ దేవరకొండ టీమ్ ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. ఇలాంటి అసత్య వార్తలు నమ్మొద్దని, విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచి కోరే హీరోగానే ఉన్నాడని, ఉంటాడని వెల్లడిస్తూ ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై తమ సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేస్తున్నందుకు ఆ మీడియా సంస్థలు, సైబర్ క్రైమ్ శాఖ చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది.
