Ananth Sriram: నా తల్లిదండ్రులకు ప్రాణాహాని ఉంది.. భీమవరం కలెక్టరేట్ వేదికగా అనంత్ శ్రీరామ్ ఆవేదన!

తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గేయరచయిత అనంత్ శ్రీరామ్(Ananth Sriram).

Ananth Sriram files a PGRS complaint regarding a land dispute in Bhimavaram.

  • అనంత్ శ్రీరామ్ స్థలం ఆక్రమణ వివాదం

  • చేగొండి సూర్యప్రకాష్‌పై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

  • వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కోరిన రచయిత

Ananth Sriram: ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో ఆయన జిల్లా అధికారులకు ఒక రాతపూర్వక ఫిర్యాదును సమర్పించారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో తమ ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Janhvi Kapoor: ‘పెద్ది’ ఈవెంట్‌లో మెరిసిన జాన్వీ కపూర్.. స్టన్నింగ్ లుక్స్‌తో స్టేజ్ షేక్.. ఫొటోలు

ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ తన వృద్ధులైన తల్లిదండ్రులను తీవ్రంగా బెదిరిస్తున్నాడని అనంత్ శ్రీరామ్(Ananth Sriram) ఆరోపించారు. మానసిక వేధింపులకు గురిచేస్తూ తన తల్లిదండ్రుల ప్రాణాలకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తన తల్లి, తండ్రులకు వెంటనే తగిన పోలీసు రక్షణ కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను వేడుకున్నారు. మరి అనంత్ శ్రీరామ్ ఫిర్యాదుపై అధికారులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.