Anantha Sreeram: కళావతి పాట పల్లవి కోసం 42 వెర్షన్లు రాసిన అనంత శ్రీరామ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు- మహానటి కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్..
- Naresh Mannam
- Published On : February 14, 2022 / 04:55 PM IST
Anantha Sreeram
Anantha Sreeram: సూపర్ స్టార్ మహేష్ బాబు- మహానటి కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో No1 ట్రెండింగ్ లో నిలిచిన ఈ పాట ఒకరోజు ముందే లీకవగా.. మేకర్స్ అనుకున్న సమయం కన్నా ఒకరోజు ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయినా.. మహేష్ ఫ్యాన్స్.. మూవీ లవర్స్ ఈ పాటకి అద్భుతమైన రికార్డును కట్టబెట్టారు.
Anasuya: లాంప్ లైట్ వెలుతురులో అనసూయ ముద్దులు..!
మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవబోతోందని సంగీత దర్శకుడు తమన్ ముందే చెప్పినట్లుగానే ఈ పాట రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంది. హీరోయిన్ ను ఉద్దేశించి తనను ఎలా ఆకట్టుకుంటుందో హీరో చెప్పేలా అనంత శ్రీరామ్ రాసిన ఈ లైన్స్ కు సింగర్ సిద్ శ్రీరామ్ ప్రాణం పోశాడు. తమన్ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ పాటకి మూలకారణం రచయిత అనంత శ్రీరామ్, సింగర్ సిద్ శ్రీరామ్, దర్శకుడు పరుశురాం.. సంగీత దర్శకుడు థమన్.
Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!
అయితే.. ఈ పాట ఇంత అద్భుతంగా రావడం వెనక చాలాకష్టమే ఉందట. ఈ పాటకి అనంత శ్రీరామ్ ఎంతో కష్టపడ్డారట. కేవలం కళావతి పాట పల్లవి కోసం 42 వెర్షన్లు రాస్తే.. అందులో ఒక్కటి ఫైనల్ చేశారట. ఆలాగే 12 వెర్షన్లు చరణాలు రాస్తే ఒక్కటి ఫైనల్ చేసుకున్నారట. ఇప్పుడు ఈ పాట సక్సెస్ చూస్తే పడిన కష్టానికి తగిన ఫలితం దక్కినట్లుగా ఉందని అనంత శ్రీరామ్ ఆనందం వ్యక్తం చేశారు. తనతో పాటు సింగర్, దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు మహేష్ శక్తి కూడా తోడవడంతోనే ఇంత భారీ అప్లాజ్ దక్కినట్లుగా శ్రీరామ్ చెప్పాడు.
