Anasuya: లాంప్ లైట్ వెలుతురులో అనసూయ ముద్దులు..!

అనసూయ అంటే బుల్లితెర హాట్ యాంకర్.. స్టార్ యాంకర్. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఒలకబోస్తూ రచ్చ చేసే అనసూయ ఈ మధ్య కాలంలో సినిమాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ గుర్తింపు..

Anasuya: లాంప్ లైట్ వెలుతురులో అనసూయ ముద్దులు..!

Anasuya

Updated On : February 14, 2022 / 4:25 PM IST

Anasuya: అనసూయ అంటే బుల్లితెర హాట్ యాంకర్.. స్టార్ యాంకర్. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఒలకబోస్తూ రచ్చ చేసే అనసూయ ఈ మధ్య కాలంలో సినిమాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలతో దూసుకొస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో అనసూయ కెరీర్ మలుపు తిరగగా.. పుష్పలో దాక్షాయణిగా అదరగొట్టింది. మరో నాలుగైదు సినిమాలతో పాటు అవకాశం చిక్కితే ఐటెం పాటలతో కూడా ఊపేస్తోంది అనసూయ.

Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

ఇక సోషల్ మీడియాలో కూడా తన సినిమా అప్డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ కూడా నెటిజన్లకు పంచి పెడుతూ ఫాలోయింగ్ పెంచుకొనే అనసూయ తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఓ రెస్టారెంట్ లో కూర్చొని కెమెరాకు ముద్దులు పెడుతున్న పోజులిచ్చిన అనసూయ ల్యాంప్ లైట్ వెలుతురులో రెడ్ డ్రెస్ లో మెరిసిపోతూ కనిపించింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

బ్యాంక్ ఉద్యోగి భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లైనా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక కొత్తగా ప్రేమలో పడిన వాళ్ళ మాదిరి భరద్వాజ్ తో కలిసి షికార్లు కూడా తగ్గలేదు. వాలంటైన్ డే రోజున ఇలా ఫోటోలు షేర్ చేస్తూ లవ్ యూ మామ్ అంటూ భర్త భరద్వాజ్ ను కూడా ట్యాగ్ చేసింది. పక్కన భరద్వాజ్ కూడా ఉండే ఉంటారని అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. లాంప్ లైట్ లో అనసూయ అందం రెట్టింపు అయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)