Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ గా టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా..

Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Krithi Shetty

Krithi Shetty: ఉస్తాద్ హీరో రామ్ పోతినేని తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ గా టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోండగా.. రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కృతిశెట్టి మహాలక్ష్మిగా కనిపించనుందని ప్రకటించిన యూనిట్ వాలంటైన్ డే స్పెషల్ గా కృతి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

స్కూటీపై స్టైలిష్ గా ఉన్న కృతి వెనక్కి తిరిగి చూస్తూ ఉండగా.. ఈ సినిమాలో విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. రామ్ పోతినేని ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుండగా అందులో ఒకటి పోలీస్. ఇక కృతి ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించనుందని సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుండగా.. కృతి శెట్టిది ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్ రోల్ అని టాక్.

DJ Tillu: ఈ ఏడాది ఇప్పటి వరకు సినిమాల్లో టాప్ టిల్లుగాడే!

ఈ సినిమాలో కృతితో పాటు అక్షర గౌడ్ కూడా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మించిన ఈ తెలుగు తమిళ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెండు బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిగతా సౌత్ బాషలలో కూడా విడుదల చేయనున్నారు.