Ananya Nagalla attends Opening of Gold Bar Challenge Game
Ananya Nagalla : గోల్డ్ బార్ ఛాలెంజ్ అనే గేమ్ వేరే దేశాల్లో ఎక్కువగా ఆడతారు. ఇప్పుడిప్పుడే ఈ గేమ్ ఇండియాలోకి వస్తుంది. క్లోజ్ చేయబడిన ఓ గ్లాస్ బాక్స్ లో గోల్డ్ బార్ ఉంటుంది. ఒక చేత్తో మాత్రమే ఆ గోల్డ్ బార్ ని చిన్న హోల్ లోంచి బయటకు తీయాలి. ఈ గేమ్ మన బలం, ట్యాలెంట్ తో ఆడాల్సినది. ఇచ్చిన సమయంలో ఆ గోల్డ్ ని బయటకు తీయగలిగితే బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చింది.
తాజాగా హైదరాబాద్‌లోని ఇన్‌ఓర్బిట్ మాల్‌లో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ మొదలైంది. దీనికి సంబంధిచి ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనన్య నాగళ్ల గెస్ట్ గా హాజరైంది. అనన్య కూడా సరదాగా ఈ గోల్డ్ బార్ గేమ్ ఆడింది. పలువురు ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం మొదలుపెట్టారు. గెలిచినా వాళ్లకు నగదు, బహుమతులు ఇస్తున్నారు.
Also Read : Sreeleela: క్లారిటీ వచ్చేసింది.. ఈ పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల..
ఈ ఈవెంట్లో అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ చాలా బాగుంది. పాల్గొనేవారి ఉత్సాహం, నైపుణ్యం చూసి ఆనందంగా ఉంది. ఇలాంటివి జనాల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక, వినోదాన్ని కూడా అందిస్తాయి అని తెలిపింది.