Nayanthara: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు.. ఆ సినిమా చేయడమే.. కేవలం గ్లామర్ డాల్ గా చూపించారు..

చెన్నై చిన్నది నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Nayanthara: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు.. ఆ సినిమా చేయడమే.. కేవలం గ్లామర్ డాల్ గా చూపించారు..

Star beauty Nayanthara makes shocking comments on Ghajini movie

Updated On : November 25, 2025 / 10:19 AM IST

Nayanthara; చెన్నై చిన్నది నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది ఈ బ్యూటీ. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన ఈ చిన్నది ఆ తరువాత వరుసగా స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకొని తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరింది. ఈ క్రమంలోనే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే. ఇటీవల ఐ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార(Nayanthara) తన కేరీర్ మొదట్లో చేసిన తప్పుల గురించి చెప్పుకొచ్చింది. గజినీ సినిమాలో నటించడం ఆమె చేసిన పెద్ద తప్పుగా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేశాయి.

Jyoti Poorvaj: హాట్ హాట్ ఫోజులతో జ్యోతి పూర్వాజ్.. సోషల్ మీడియాలో అందాల రచ్చ.. ఫోటోలు

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తమిళ స్టార్ సూర్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గజిని. డిఫరెంట్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది నయనతార. సినిమా విజయంలో కూడా కీలకపాత్ర పోషించింది. కానీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది..”నేను నా కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది గజిని సినిమా ఒప్పుకోవడమే. ఆ సినిమాలో రెండవ హీరోయిన్ గా చేయడం నేను చేసిన తప్పు. కథ చెప్పినప్పుడు చాలా నచ్చిన పాత్ర తీరా ఫైనల్ అవుట్ ఫుట్ లో అలా లేదు. చాలా సీన్స్ కట్ చేశారు. నన్ను కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే ప్రొజెస్ట చేశారు” అంటూ చెప్పుకొచ్చింది నయనతార. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమాను కూడా ఒకే చేసిన నయన్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీ నుంచి ఇటీవలే నయనతార లుక్ విడుదల చేశారు మేకర్స్.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.