Ananya Panday : ఆ హీరోతో రిలేషన్‌లో ఉన్న లైగర్ భామ అనన్య.. నిజమేనా..?
విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో నటించిన అనన్య పాండే.. ఆ హీరోతో రిలేషన్‌షిప్ లో ఉందట. నిజమేనా..?
- gum 95921
- Published On : August 4, 2023 / 08:42 PM IST
Ananya Panday father gave clarity on her relation with Aditya Roy Kapur
Ananya Panday : బాలీవుడ్ భామ అనన్య పాండే లైగర్ (Liger) సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కూడా పరిచయం అయ్యింది. లైగర్ తో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యిపోదాం అని అనుకుంది. కానీ ఆమె కలల పై ఆ సినిమా నీళ్లు చల్లింది. ఇది ఇలా ఉంటే, కొన్ని రోజులు నుంచి ఈ భామ చుట్టూ ప్రేమ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో అనన్య బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur) తో తరుచుగా కనిపిస్తుంది. దీంతో బి-టౌన్ లో వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్ అయ్యింది.
Actress Poorna : నటి పూర్ణ కొడుకుని చూశారా.. బలే ముద్దుగా ఉన్నాడు.. ఫోటోలు వైరల్!
అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్ గురించి అనన్య తండ్రి చంకీ పాండే (Chunky Panday) మీడియా ముందు మాట్లాడారు. “ఇండస్ట్రీలో యాక్టర్స్ రిలేషన్స్ పై అనేక రూమర్స్ రావడం సహజం. అవి వారి కెరీర్ కూడా నష్టాన్ని కలిగిస్తుంటాయి. రంగుల ప్రపంచంలో బ్రతుకుతున్న మేము వాటిని కట్టడి చేయలేము. నా కూతురు తనతో నటించే ప్రతి యాక్టర్ తో స్నేహం గానే ఉంటుంది. అయితే అది ప్రేమ అనేది మాత్రం తప్పు” అని చెప్పుకొస్తూ అనన్య ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నటన పై ప్రశంసలు కురిపించారు.
సూపర్ హిట్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. లైగర్ తో కలుపుకొని 5 సినిమాలు చేసింది. లైగర్ స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుందని భావించినా, అది అందలేదు. ప్రస్తుతం ‘డ్రీమ్ గర్ల్ 2’ (Dream Girl 2) సినిమాలో నటిస్తుంది. ఈ నెల 25న ఈ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
