Actress Poorna : నటి పూర్ణ కొడుకుని చూశారా.. బలే ముద్దుగా ఉన్నాడు.. ఫోటోలు వైరల్!

ఏప్రిల్ నెలలో పండంటి మగబిడ్డకు జన్మనించిన నటి పూర్ణ.. ఎట్టకేలకు తన కొడుకు పేస్ ని రివీల్ చేసింది.

Actress Poorna : నటి పూర్ణ కొడుకుని చూశారా.. బలే ముద్దుగా ఉన్నాడు.. ఫోటోలు వైరల్!

Actress Poorna reveals her new born son face to fans

Actress Poorna : టాలీవుడ్ యాక్ట్రెస్ ఇటీవలే పండంటి మగబిడ్డకు దుబాయ్ లో జన్మనించింది. గత ఏడాది అక్టోబర్ లో ఎటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. ఆ విషయాన్ని కొన్నిరోజులు తరువాత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. కేరళకు చెందిన శనిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తి దుబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తగా ఎదిగాడు. ఈ వ్యక్తినే పూర్ణ పెళ్లి చేసుకున్నది. ఇక వీరిద్దరి పెళ్ళైన రెండు నెలలకే పూర్ణ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ లోనే ఉంటూ వస్తుంది.

Sai Dharam Tej : మిమ్మ‌ల్ని అభిమానుల్లా కాదు బ్రోస్ లా భావిస్తా.. ఆ ఒక్క ప‌ని మాత్రం చేయండి.. ప్లీజ్‌

తన సీమంతం వేడుకను కూడా అక్కడే ఘనంగా చేసుకుంది. ఇక ఏప్రిల్ 4న ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి హాస్పిటల్ లోని ఫోటోలను షేర్ చేసి ఆ గుడ్ న్యూస్ ని అందరితో పంచుకున్న పూర్ణ.. కొడుకు పేస్ ని మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయకుండా వచ్చింది. దీంతో పూర్ణ కూడా అందరి హీరోయిన్స్ లా వారసులు విషయంలో గోప్యత వహిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పూర్ణ ఆ గోప్యతకి ఫుల్ స్టాప్ పెట్టి తన ముద్దుల కొడుకుని అందరికి చూపించింది. తన భర్త, బిడ్డతో కలిసి ఇటీవల ఒక పెళ్లి కార్యక్రమానికి పూర్ణ హాజరయ్యింది.

Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?

ఆ ఈవెంట్ లో ఫోటోగ్రాఫర్స్ కి పూర్ణ తన కొడుకుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్స్ బుడ్డోడు భలే ముద్దుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా పూర్ణ చివరిగా నాని ‘దసరా’ సినిమాలో కనిపించింది. త్వరలోనే ఆమె మళ్ళీ సినిమాలోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా పూర్ణ మలయాళీ అమ్మాయి. కానీ ఈ భామ తెలుగు సినిమాలతో స్టార్‌డమ్ ని సంపాదించుకుంది. సినిమాలు మాత్రమే కాదు తెలుగు షోల్లో కూడా పాల్గొని ఇక్కడ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది.

 

View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

 

View this post on Instagram

 

A post shared by Faisal Ak (@faisal_malabar)