అనసూయ.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 01:03 PM IST
అనసూయ.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా..

Updated On : April 27, 2020 / 1:03 PM IST

ఈ లాక్‌డౌన్ పుణ్య‌మా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది త‌మ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా పాపులర్ యాంకర్ అనసూయ షేర్ చేసిన Throwback Picture సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనసూయ 11 ఏళ్ల క్రితం యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి పిక్ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. 2009లో తాను చేసిన ఫస్ట్ టీవీ షో ప్రసారం అయినప్పటి ఫోటో అంటూ అనసూయ తెలిపింది. ఓ న్యూస్ ఛానెల్‌లో అనసూయ న్యూస్ చదువుతున్నప్పటి ఫోటో అది. ఈ ట్వీట్‌కు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూన్నారు. అప్పుడు.. ఇప్పడు.. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు..అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా.. అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.