×
Ad

Anasuya – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. చిన్న పాత్ర చేశాను అంటూ..

అనసూయ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల్లో నటించిందని తెలుస్తుంది.

  • Published On : July 10, 2024 / 09:58 AM IST

Anasuya played a Character in Pawan Kalyan Upcoming Movie

Anasuya – Pawan Kalyan : యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా సినిమాల్లో బిజీగా ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్.. లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా మంచి పాత్రలు పట్టేసి దూసుకుపోతుంది. సినిమాల్లో బిజీగానే ఉంటూ టీవీ షోలలో కూడా అప్పుడప్పుడు అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది.

తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించగా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని.. మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. ఒక చిన్న పాత్ర చేశాను.. రిలీజ్ అవ్వాలి అని తెలిపింది. దీంతో అనసూయ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల్లో నటించిందని తెలుస్తుంది.

Also Read : Premi Vishwanath Son : కార్తీక దీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? బాడీ బిల్డర్‌లా ఎలా ఉన్నాడో చూడండి..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఉస్తాద్ షూట్ ఒక్క షెడ్యూల్ జరిగింది. అది ఎలాగో గ్లింప్స్ లో చూపించారు. దీంట్లో అయితే అనసూయ ఉండే ఛాన్స్ లేదు. మరి అనసూయ పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఉందా లేక హరిహర వీరమల్లు సినిమాలో ఉందా తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక మూడు నెలల తర్వాత సినిమాలకు డేట్స్ ఇచ్చి చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేస్తాను అని ఓ పబ్లిక్ మీటింగ్ లో తెలిపారు.