×
Ad

Anasuya : ఈ వయసులో నీకెందుకు ఆంటీ అన్నవాళ్లకు.. అనసూయ దసరా మోటివేషనల్ పోస్ట్..

తాజాగా దసరా రోజు స్త్రీ శక్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. జిమ్ లో తాను కష్టపడుతున్న వర్కౌట్స్ ని వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఓ మోటివేషనల్ పోస్ట్ చేసింది అనసూయ.

  • Published On : October 25, 2023 / 08:07 AM IST

Anasuya Shares an Motivational post with Gym Video

Anasuya : అనసూయ యాంకర్ గా గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అనసూయ చేసే కొన్ని ట్వీట్స్ అప్పుడప్పుడు వైరల్ అయి ట్రోల్ చేసే విధంగా అంటాయి. అయినా అనసూయ అవేమి పట్టించుకోకుండా ట్రోలర్స్ కి కౌంటర్లు ఇస్తూనే, తన పని తాను చేసుకుంటూ పోతుంది.

తాజాగా దసరా రోజు స్త్రీ శక్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. జిమ్ లో తాను కష్టపడుతున్న వర్కౌట్స్ ని వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఓ మోటివేషనల్ పోస్ట్ చేసింది అనసూయ. అనసూయ తన జిమ్ వీడియో పోస్ట్ చేసి.. దసరా అంటే చెడుపై మంచి గెలిచిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే బద్దకంపై హార్డ్ వర్క్ గెలవడం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. భయాలు, అనుమానాల నుంచి బయటకి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది నా సొంత అనుభవంతో చెప్తున్నాను. మా నాన్న చనిపోయినప్పుడు నాకు అన్నిటి మీద ఆసక్తి పోయింది. తిండి, నిద్ర అన్ని మారిపోయాయి. కానీ ఏదో ఒకరోజు మొదలుపెట్టాలి. మా నాన్న చెప్పేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం. అది గుర్తు చేసుకొని మళ్ళీ మొదలుపెట్టాను అని చెప్పింది.

Also Read : Vijayashanthi : సీనియర్ ఎన్టీఆర్‌ని, కళ్యాణ్ రామ్‌ని పోలుస్తూ విజయశాంతి ట్వీట్.. వైరల్

అలాగే.. ఈ దసరా నేను చేస్తున్న వర్కౌట్స్ మహిళలు అంతా తమ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేసేలా ఉండాలి అనుకుంటున్నాను. మనం శక్తి స్వరూపం, పవర్.. అది మర్చిపోవద్దు. నీకిప్పుడు అవసరమా ఆంటీ, 35 దాటిన తర్వాత ఇవన్నీ ఎందుకు, ఇంట్లో పిల్లలని చూసుకోవచ్చు కదా అనే వాళ్లంతా మన స్వాతంత్య్రాన్ని చూసి భయపడతారు. మనం మన ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలి వాళ్ళ గురించి పట్టించుకోకుండా. మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. ప్రతి మహిళా కాళీమాతలా మారాలి అని పోస్ట్ చేసింది. దీంతో అనసూయ పోస్ట్ వైరల్ గా మారింది.