Simbaa Movie : మొక్కలు నాటండి.. సినిమా టికెట్స్ ఫ్రీగా పట్టండి.. స్టేజిపై ఎమోషనల్ అయిన డైరెక్టర్..
తాజాగా సింబా డైరెక్టర్ గా తన మొదటి సినిమా కావడంతో స్టేజిపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
- Saketh U
- Published On : August 5, 2024 / 06:58 AM IST
Anasuya Simbaa Movie Director Got Emotional in Pre Release event
Simbaa Movie : అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సింబా’. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త నిర్మాణంలో మురళీ మనోహర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చెట్లు, అడవులు ఎంతో ముఖ్యం, వృక్షో రక్షిత రక్షితః అనే పాయింట్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరగగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గెస్టుగా వచ్చారు. సింబా సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది.
ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న మురళీ మనోహర్ లండన్ ఫిలిం స్కూల్ లో కోర్సులు చేసి అక్కడే రెండు ఇండీ సినిమాలకు పనిచేసి అనంతరం ఇండియాకు వచ్చాడు. ఇక్కడ పలు షార్ట్ ఫిలిమ్స్ తీసిన మురళీ మనోహర్ సంపత్ నంది వద్ద ఏమైంది ఈ వేళ సినిమా నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసారు. అంతే కాకుండా సంపత్ నంది నిర్మాణ సంస్థలో అదనపు బాధ్యతలు కూడా చూసుకున్నాడు. తాజాగా సింబా డైరెక్టర్ గా తన మొదటి సినిమా కావడంతో స్టేజిపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీ తనకు అందించిన సహకారాన్ని గుర్తుంచేసుకొని స్టేజిపై ఏడ్చేశాడు. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఇప్పుడు డైరెక్టర్ అవ్వడంతో ఎమోషనల్ అయ్యాడు డైరెక్టర్ మురళీ మనోహర్.
Also Read : Rajamouli : రాజమౌళి షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే ఏం చేస్తారో తెలుసా?
ఇక సింబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శ్రీనాథ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి తనకు మెసెజ్ చేస్తే సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తానని తెలిపాడు. హరితహారం కార్యక్రమాన్ని సెలబ్రిటీలతో బాగా ప్రచారం చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కూడా ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. శ్రీనాథ్ మాత్రమే కాదు నేను కూడా టికెట్లు ఇస్తాను, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి అని కోరారు. త్వరలోనే ఈ మొక్కలు నాటి టికెట్స్ ఎలా పొందాలి అని మూవీ యూనిట్ ప్రకటించనున్నారు. ఇంకేంటి మరి మొక్కలు నాటే ఒక మంచిపని చేసి సింబా సినిమా టికెట్స్ ఫ్రీగా పొందండి.
