Rajamouli : రాజమౌళి షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే ఏం చేస్తారో తెలుసా?

రాజమౌళి షూటింగ్ లేకపోతే, ఖాళీగా ఉంటే ఏం చేస్తాడో రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి ఇద్దరూ తెలిపారు.

Rajamouli : రాజమౌళి షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే ఏం చేస్తారో తెలుసా?

Rajamouli and Rama Rajamouli Reacts What Rajamouli Do if No Movie Shooting

Updated On : August 5, 2024 / 6:03 AM IST

Rajamouli : మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. RRR సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ లోపే రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని చేసారు. రాజమౌళిపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళికి క్లోజ్ గా ఉండేవాళ్లంతా చాలా ఆసక్తికర విషయాలు తెలిపారు.

రాజమౌళి షూటింగ్ లేకపోతే, ఖాళీగా ఉంటే ఏం చేస్తాడో రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి ఇద్దరూ తెలిపారు. రమా రాజమౌళి మాట్లాడుతూ.. షూటింగ్ లేకపోతే రాజమౌళి చాలా బద్దకంగా ఉంటారు. పడుకోరు కానీ ఖాళీగా కూర్చుంటారు. ఏదో ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి ఆ బద్ధకం పోగొట్టుకోవడానికి బయటకు వెళ్లి గేమ్స్ ఆడతారు. నిజానికి రాజమౌళి చాలా లేజీ అని తెలిపింది.

Also Read : Double iSmart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. డబుల్ కిక్ ఇచ్చిన రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్

రాజమౌళి దీనిపై స్పందిస్తూ.. నాకు స్పోర్ట్స్ నాకు మెడిటేషన్ లాంటిది. వాలీబాల్, క్రికెట్.. ఇలా పలు గేమ్స్ ఆడతను. ఈ గేమ్స్ ఆడేటప్పుడు నా ఫోకస్ అంతా బాల్ మీదే ఉంటుంది. నేను ఖాళీగా ఉన్నప్పుడు వ్యవసాయం, గేమ్స్, కుటుంబం, సెలవుల గురించి ఆలోచిస్తాను అని తెలిపారు. దీంతో రాజమౌళికి కూడా బద్ధకం ఎక్కువే అయితే అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.