Lahari Shari
Lahari Shari: ఇప్పడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్ 5’ లో ఫైనల్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొంతమంది యాంకర్స్, యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ పేర్లు వైరల్ అవుతున్నాయి. కానీ ‘బిగ్ బాస్’ టీం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వార్త, లేదా కంటెస్టెంట్ పేరు బయటకు రాకుండా చాలా అంటే చాలా జాగ్రత్త పడుతున్నారు.
Navya Swamy : బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చెయ్యడానికి రీజన్ అదే..
‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో పార్టిసిపెట్ చేసే వారి లిస్టులో మరో పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కాదు.. పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ లహరి షరి.. ఓ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా పలు తెలుగు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుందామె.
Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..
‘బిగ్ బాస్’ టీం షో లో పాల్గొనాల్సిందిగా అడగడం.. వాళ్ల కండీషన్స్ తనకు కంఫర్టబుల్‌గా అనిపించడంతో లహరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అలాగే కొన్ని మీమ్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ గత నాలుగు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు 5వ సీజన్‌తో ఆడియెన్స్‌కి మోర్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రాబోతుంది. వరుసగా మూడోసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇటీవల వదిలిన ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Pic Credit: @lahari_shari