Sandalwood Drugs Case: నేను ఏ తప్పూ చేయలేదు.. భోరున ఏడ్చేసిన అనుశ్రీ..

  • Publish Date - October 3, 2020 / 05:13 PM IST

Anchor Anushree – Sandalwood Drugs Case: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసే రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో, ఎవరికి నోటీసులు వస్తాయోనని సినీ ప్రముఖులు వణికిపోతున్నారు. తాజాగా విచారణను ఎదుర్కొన్న యాంకర్‌ అనుశ్రీ తనకు డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీసీబీ విచారణ చేసినంత మాత్రాన తానేం నేరస్తురాలిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. తనకు తెలిసిన వివరాలు సీసీబీ అధికారులకు అందించానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కన్నీరు మున్నీరయ్యారు. కాగా సీసీబీకి సహకరించని నిందితుడు వీరేన్‌ ఖన్నాకు నార్కోటెస్ట్‌ నిర్వహించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు.


ఈమేరకు కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. నార్కోటెస్ట్‌లను నిర్వహించటానికి అహమ్మదాబాద్‌ లేదా ఖన్నాను హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సీసీబీ అధికారులు నిర్ణయించారు. అయితే నార్కోటెస్ట్‌కు వీరేన్‌ ఖన్నా అంగీకరించలేదని తెలుస్తోంది. ఖన్నా నివాసముంటున్న ఫ్లాట్స్‌పై సీసీబీ దాడి చేసి పోలీస్‌ యూనిఫామ్, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.