Ram Charan : చరణ్ స్టైల్ పై అమెరికన్ యాంకర్ కామెంట్స్.. వినయంగా నటించడానికి ట్రై చేస్తున్నా అంటున్న చరణ్..
ఇటీవల కాలంలో రామ్ చరణ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం చరణ్ స్టైల్ కి ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలోని యాంకర్ కూడా చరణ్ స్టైల్ ని పొగుడుతూ మాట్లాడాడు. రామ్ చరణ్ దానికి బదులిస్తూ..
- gum 95921
- Published on- February 23, 2023 / 03:50 PM IST
Ram Charan style
Ram Charan : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ మరియు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో దిగిన చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అమెరికన్ పాపులర్ టాక్ షో అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’కు రామ్ చరణ్ గెస్ట్ గా ఆహ్వానం అందుకున్నాడు. ఇండియన్ నుంచి ఈ షోకి అతిధిగా హాజరయిన మొదట సెలెబ్రెటీగా రామ్ చరణ్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ షోలో పాల్గొన్న చరణ్.. RRR మరియు తన పర్సనల్ విషయాలను చర్చించాడు.
Ram Charan : అమెరికా వెళ్లేముందు మాలలో రామ్చరణ్.. వెళ్ళాక మాల ఏమైంది.. క్లారిటీ!
కాగా ఇటీవల కాలంలో రామ్ చరణ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం చరణ్ స్టైల్ కి ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలోని యాంకర్ కూడా చరణ్ స్టైల్ ని పొగుడుతూ మాట్లాడాడు. ఇంటర్వ్యూ సమయంలో చరణ్ కూర్చున్న స్టైల్ ని చూసిన యాంకర్.. అతని స్వాగ్ చూడండి అంటూ వ్యాఖ్యానించాడు. రామ్ చరణ్ దానికి బదులిస్తూ.. నేను వినయంగా నటించడానికి ట్రై చేస్తున్నా అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇక షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చరణ్ స్టైల్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇది ఇలా ఉంటే రామ్ చరణ్.. రేపు (ఫిబ్రవరి 24) బెవర్లీ హిల్స్ లో జరగబోయే HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ కి ప్రజెంటర్ గా హాజరు కాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం. అలాగే మార్చి 13న జరిగే ఆస్కార్ అవార్డులు వేడుకల్లో కూడా చరణ్ సందడి చేయబోతున్నాడు.
