Gayatri Bhargavi : మా పక్కింట్లో ఉండేవారు.. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారు.. స్టార్ హీరోపై యాంకర్ వ్యాఖ్యలు..

తాజాగా యాంకర్, నటి గాయత్రీ భార్గవి హీరో దుల్కర్ సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Anchor Gayatri Bhargavi Interesting Comments on Dulquer Salmaan in Lucky Baskhar Success Meet

Gayatri Bhargavi : తాజాగా యాంకర్, నటి గాయత్రీ భార్గవి హీరో దుల్కర్ సల్మాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. తాజాగా దీపావళికి లక్కీ భాస్కర్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో ఆల్మోస్ట్ 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఈ సినిమాలో దుల్కర్ తో పాటు నటించే బ్యాంక్ ఎంప్లాయ్ రోల్ చేసింది. సినిమాలో చాలా సీన్స్ లో కనిపిస్తుంది. అయితే నేడు లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ అంతా విచ్చేసారు. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో గాయత్రీ భార్గవి మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు చెన్నైలో నా పక్కింటిలో ఉండేవారు ఆయన. కుర్రాడిగా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేటప్పటి నుంచి తెలుసు. ఇవాళ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది అని తెలిపింది. దీంతో గాయత్రీ భార్గవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Also Read : Ka Movie : ‘ క ‘ మూవీ టికెట్స్ అమ్ముతున్న కిరణ్ అబ్బవరం.. వీడియో చూసారా..

అలాగే.. సినిమాలో ఇంకా చాలా సీన్స్ లో ఉండాలి కానీ ఎడిటింగ్ లో తీసేసారు. దీని గురించి డైరెక్టర్, ఎడిటర్ ని అడగాలి అంటూ సరదాగా అంది. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో దుల్కర్ తాను యంగ్ గా ఉన్నప్పుడు కార్స్ ఫుల్ ర్యాష్ గా డ్రైవ్ చేసేవాడ్ని అని, 200 – 300 స్పీడ్ లో కూడా తోలేవాడ్ని అని చెప్పాడు.