Anchor Pradeep : వామ్మో ప్రదీప్ ఇలా అయిపోయాడేంటి.. కండలు పెంచేసి.. చాన్నాళ్ళకి కనపడిన యాంకర్ ప్రదీప్..
ఇటీవల యాంకర్ ప్రదీప్ ఓ జిమ్ లో బాగా కష్టపడుతున్న వీడియోని ఆ జిమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Saketh U
- Published On : March 12, 2024 / 09:04 AM IST
Anchor Pradeep workouts in Gym Recent Looks goes Viral
Anchor Pradeep : యాంకర్ గా తెలుగు బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్. ఎన్నో రకాల టీవీ షోలతో దాదాపు ఓ పదేళ్ల పాటు టెలివిజన్ ప్రేక్షకులని అలరించి యాంకర్ సుమ తర్వాత ఆ రేంజ్ పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్. ఇక ఢీ షోతో బాగా వైరల్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు. హీరోగా ఓ సినిమా చేసినా, మధ్యలో కొన్నాళ్ళు టెలివిజన్ కి గ్యాప్ ఇచ్చినా ఢీ షో మాత్రం వదల్లేదు. గత సీజన్ వరకు ప్రదీప్ యాంకరింగ్ చేస్తూనే వచ్చాడు.
కానీ ఈ సీజన్ లో ప్రదీప్ రాకపోవడం, ఇంకే షోలోను కనిపించకపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు ప్రదీప్ ని బాగా మిస్ అవుతున్నారు. అసలు ప్రదీప్ ఢీ షో ఎందుకు మానేసాడు, బయట కూడా ఎక్కడా కనపడట్లేదు, అసలు టీవీలోనే రావట్లేదు అనే ప్రశ్నలు అందరికి వస్తున్నాయి. వీటికి ప్రదీప్ కానీ వేరే ఎవరూ కానీ సమాధానం చెప్పలేదు. తాజాగా చాలా రోజుల తర్వాత ప్రదీప్ రీసెంట్ లుక్స్ వైరల్ గా మారాయి.
Also Read : Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా?
ఇటీవల యాంకర్ ప్రదీప్ ఓ జిమ్ లో బాగా కష్టపడుతున్న వీడియోని ఆ జిమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లుక్ లో ప్రదీప్ బాగా కండలు పెంచేసి, ఫేస్ లో కూడా కొంచెం చేంజ్ వచ్చి కనిపిస్తున్నాడు. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రదీప్ ఏంటి ఈ రేంజ్ లో మారిపోయాడు? ఇంకో సినిమా హీరోగా ప్లాన్ చేస్తున్నాడా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? త్వరగా టీవీలోకి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత ప్రదీప్ కనపడటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. యాంకర్ ప్రదీప్ జిమ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
