Roja – Manchu Lakshmi : రోజా, మంచు లక్ష్మి కలిసి మాస్ డ్యాన్స్ దుమ్ము లేపారుగా.. వామ్మో ఇదేం డ్యాన్స్ రా నాయనా.. వీడియో వైరల్..

తాజాగా యాంకర్ రవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసాడు.

Anchor Ravi Roja Manchu Lakshmi Mass Dance in Super Serial Championship Video goes Viral

Roja – Manchu Lakshmi : మంచు లక్ష్మి, రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమోలు వైరల్ గా మారాయి. షోలో రోజా, మంచు లక్ష్మి సందడి చేసారు. అయితే తాజాగా యాంకర్ రవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసాడు.

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోగ్రాంని యాంకర్ రవి హోస్ట్ చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాంలో మంచు లక్ష్మి, రోజా మాస్ డ్యాన్సులు చేసిన వీడియోని రవి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ముందు యాంకర్ రవి, మంచు లక్ష్మి కలిసి మాస్ డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత రవి, రోజా కలిసి డ్యాన్స్ వేశారు. అనంతరం రవి, మంచు లక్ష్మి, రోజా ముగ్గురూ కలిసి డ్యాన్స్ వేశారు.

Also Read : Chiranjeevi – Sridevi : ఆ సినిమా షూట్ లో.. శ్రీదేవి ఇంగ్లాండ్ నుంచి నాకు ఆ గిఫ్ట్ తెచ్చింది.. ఏం గిఫ్ట్ తెలుసా?

దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా మంచు లక్ష్మి ఈ రేంజ్ లో మాస్ డ్యాన్స్ వేసిందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. రవి వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్ లో పెట్టడంతో వెళ్లి మరింత మాస్ గా డ్యాన్స్ వేసినట్టు అనిపిస్తుంది. దీంతో రోజా, మంచు లక్ష్మి డ్యాన్స్ లు చూసి షాక్ అవుతున్నారు జనాలు.

మీరు కూడా రోజా, మంచు లక్ష్మి మాస్ డ్యాన్స్ వీడియో చూసేయండి..

 

Also Read : Bhairavam : విజయ్ దేవరకొండకు పోటీగా.. మంచు మనోజ్ – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా..