Bhairavam : విజయ్ దేవరకొండకు పోటీగా.. మంచు మనోజ్ – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Bhairavam : విజయ్ దేవరకొండకు పోటీగా.. మంచు మనోజ్ – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా..

Manchu Manoj Nara Rohith Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Release Date Announced

Updated On : May 9, 2025 / 5:22 PM IST

Bhairavam : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోలు కలిసి ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాతో రాబోతున్నారు. భైరవం సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మాణంలో విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్స్ గా, జయసుధ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే భైరవం సినిమా టీజర్, సాంగ్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని మే 30న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ కూడా రిలీజ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.

Manchu Manoj Nara Rohith Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Release Date Announced

Also Read : Abhinaya : మెగాస్టార్, గ్లోబల్ స్టార్ తో హీరోయిన్ ఫొటో.. భర్తతో కలిసి లండన్ లో మీట్.. ఫొటో వైరల్..

అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉండటం, తమిళ్ సూపర్ హిట్ సినిమా గరుడన్ రీమేక్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.