Paravateesam : ప్రమోషన్స్ కోసం అందరితో కొట్టించుకుంటున్న హీరో.. శ్రీముఖితో చెంపదెబ్బ..

సినిమా ప్రమోషన్స్ కోసం హీరో పార్వతీశం చెంపదెబ్బలు కొట్టించుకుంటున్నాడు.

Anchor Sreemukhi Slapped Hero Paravateesam in Market Mahalakshmi Movie Promotions

Paravateesam : పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజయి వైరల్ అయ్యాయి. ఓ సాఫ్ట్‌వేర్ కుర్రోడు మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 29 రిలీజ్ కానుంది.

ఇక ఇటీవల వచ్చే సినిమాలు కొత్తకొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. తమ సినిమాలు జనాల్లోకి వెళ్ళడానికి ప్రమోషన్స్ విషయంలో మూవీ యూనిట్స్ అస్సలు తగ్గట్లేదు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరూ కొత్త కొత్తగా తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ మార్కెట్ మహాలక్ష్మి మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తున్నారు.

ఇప్పటికే మార్కెట్ మహాలక్ష్మి బోర్డ్స్ తో కొన్ని వాహనాలు ఊర్లల్లో తిప్పుతున్నారు. అలాగే మహాలక్ష్మి అనే పేరు ఉన్న 200 మందికి ఫ్రీ టికెట్స్ కూడా ఇస్తామన్నారు. ఇప్పుడేమో సినిమా ప్రమోషన్స్ కోసం హీరో పార్వతీశం చెంపదెబ్బలు కొట్టించుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరో – హీరోయిన్ ని మొదటిసారి చూడగానే ప్రపోజ్ చేస్తే లాగి చెంప మీద కొడుతుంది హీరోయిన్. టీజర్, ట్రైలర్స్ లో ఆ సీన్ ఉండటంతో బాగా వైరల్ అయింది. సినిమాలో నిజంగానే హీరోయిన్ తో కొట్టించుకున్నాడని ప్రెస్ మీట్స్ లో హీరో పార్వతీశం తెలిపాడు.

Also Read : RC 17 Movie : రామ్ చరణ్ RC16 ఇంకా షూట్ మొదలవ్వలేదు.. అప్పుడే RC17 ట్రెండింగ్.. మరోసారి రంగస్థలం కాంబో..

ఇప్పుడు యాంకర్ శ్రీముఖితో(Sreemukhi) ఇంటర్వ్యూ చేయగా ప్రమోషన్ కోసం ఆ సీన్ రీ క్రియేట్ చేసి శ్రీముఖికి హీరో పార్వతీశం ప్రపోజ్ చేసి చెంప దెబ్బ కొట్టించుకున్నాడు. ప్రమోషన్స్ కోసం ఇలా దెబ్బలు కూడా తింటారా అని ఆశ్చర్యపోతున్నారు అంతా. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇంకెంతమంది చేతిలో చెంప దెబ్బలు తింటాడో చూడాలి. అయితే ఊరికే చెంపదెబ్బ తిన్నట్టు నటించి సౌండ్ వేసుకున్నారు ప్రమోషన్స్ కోసం అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ మధ్య ప్రమోషన్స్ లో మూవీ యూనిట్స్ తమ తెలివితేటల్ని బాగా వాడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు