RC 17 Movie : రామ్ చరణ్ RC16 ఇంకా షూట్ మొదలవ్వలేదు.. అప్పుడే RC17 ట్రెండింగ్.. మరోసారి రంగస్థలం కాంబో..

రామ్ చరణ్ RC16 తర్వాత RC17 సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

RC 17 Movie : రామ్ చరణ్ RC16 ఇంకా షూట్ మొదలవ్వలేదు.. అప్పుడే RC17 ట్రెండింగ్.. మరోసారి రంగస్థలం కాంబో..

Ram Charan RC 17 goes Trending Movie under Sukumar Direction

RC 17 Movie : రామ్ చరణ్(Ram Charan) ఓ పక్క గేమ్ ఛేంజర్ షూట్ లో ఉన్నాడు. నిన్నే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా నిన్నే పూజా కార్యక్రమాలు చేసుకుంది. RC16 సినిమా షూట్ ఇంకా మొదలవ్వలేదు. ఇంకా నిన్నటి పూజా కార్యక్రమాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. కానీ అప్పుడే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా RC17 కూడా వైరల్ అవుతుంది.

RC16 తర్వాత RC17 సినిమా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కనుంది. సుకుమార్ ఆల్రెడీ చరణ్ కి కథ చెప్పి లాక్ చేసాడు. గతంలో రాజమౌళి సుకుమార్ – రామ్ చరణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని, నేను కూడా ఆ కథ విన్నాను అని చెప్పి ఆ సినిమాపై అంచనాలు పెంచాడు. సుకుమార్ – చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ లోనే అప్పటివరకు వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఒకే మూసలో కమర్షియల్ సినిమాలతో వెళ్తున్న చరణ్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది రంగస్థలం.

Also Read : Mythri Movie Makers : సీరియల్స్‌లోకి సినిమా నిర్మాణ సంస్థ.. రాజశేఖర్ టైటిల్, చిరంజీవి సినిమా స్టోరీతో మొదటి సీరియల్..

దీంతో మరోసారి సుకుమార్ – చరణ్ కాంబో సినిమా ఉండటంతో అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. నిన్న RC16 పూజా కార్యక్రమానికి సుకుమార్ కూడా రావడంతో RC17 సినిమా గురించి అందరూ చర్చిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో RC17 నేడు ట్రెండింగ్ లో ఉంది. సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 సినిమా అయ్యాక రామ్ చరణ్ సినిమా వర్క్ మొదలుపెడతాడని సమాచారం. సుక్కు – చరణ్ రంగస్థలంని మించి ఇంకెలాంటి సినిమా తీస్తారో ఎదురుచూడాలి.

Ram Charan RC 17 goes Trending Movie under Sukumar Direction