Anchor Suma : సుమ అడ్డా ఎంటర్టైన్మెంట్ గడ్డ.. యాంకరింగ్‌కి బ్రేక్ ఇచ్చేదేలే అంటున్న సుమ..
మలయాళీ అమ్మాయిగా తెలుగువారికి పరిచయమై, తెలుగునాట స్టార్ మహిళ అనిపించుకుంది యాంకర్ సుమ. అయితే ఇటీవల సుమ యాంకరింగ్‌కి బ్రేక్ ఇస్తున్నట్లు ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. అయితే ఆమె దానికి స్పందిస్తూ.. అది నిజం కాదంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా...
- gum 95921
- Published On : January 3, 2023 / 11:15 AM IST
Anchor Suma once again gave clarity about break to anchoring
Anchor Suma : మలయాళీ అమ్మాయిగా తెలుగువారికి పరిచయమై, తెలుగునాట స్టార్ మహిళ అనిపించుకుంది యాంకర్ సుమ. దాదాపు 15 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో రాణిస్తున్న సుమ.. తన మాటలతో, తన పంచులతో, తన కామెడీ టైమింగ్‌తో తెలుగువారి ఇంటిలో ఒకరిగా మారిపోయింది. టీవీ షోలు దగ్గర నుంచి సినిమా ఆడియో అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు, ప్రత్యేక ఇంటర్వ్యూలు వరకు సుమ తప్పకుండా యాంకరింగ్ చేయాల్సిందే.
Anchor Suma : యాంకరింగ్‌కి బ్రేక్.. స్పందించిన సుమ!
అయితే ఇటీవల సుమ యాంకరింగ్‌కి బ్రేక్ ఇస్తున్నట్లు ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు అది నిజమనుకొని సుమని సంప్రదించడం మొదలుపెట్టారు. అయితే ఆమె దానికి స్పందిస్తూ.. అది నిజం కాదంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తను కొత్తగా స్టార్ట్ చేయబోతున్న టాక్ షో ప్రోమోని విడుదల చేస్తూ.. ‘నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టా’ అంటూ మరోసారి చెప్పుకొచ్చింది.
‘సుమ అడ్డా’ అనే ఒక కొత్త టాక్ షో జనవరి 7 నుంచి ప్రముఖ ఛానల్ లో మొదలు కానుంది. ప్రతి శనివారం రాత్రి గం:9.30లకు ఈ షో ప్రసారం కానుంది. అయితే ఆ సమయంలో ఇంతకముందు సుమ ‘క్యాష్’ ప్రోగ్రాం ప్రసారం అయ్యేది. మరి ఆ షోని నిలిపివేసారా? అనేది చూడాలి. ఇక ఈ షోకి అతిథిలుగా శేఖర్ అండ్ జానీ మాస్టర్స్, అలీ అండ్ పోసాని కృష్ణమురళి, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళు ముందుగా రాబోతున్నారు. ఇటీవల కాలంలో టాక్ షోస్‌కి మంచి ఆదరణ వస్తున్న తరుణంలో ఈ టాక్ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
