Anchor Suma : యాంకరింగ్‌కి బ్రేక్.. స్పందించిన సుమ!

తెలుగు యాంకరింగ్ రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ సుమ. అయితే ఈ స్టార్ యాంకర్.. యాంకరింగ్‌కి బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పిన ఒక వీడియో బయటకి రావడంతో, అందర్నీ షాక్ కి గురిచేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో, సుమ దీనిపై స్పందించింది.

Anchor Suma : యాంకరింగ్‌కి బ్రేక్.. స్పందించిన సుమ!

Anchor Suma gave clarity about quitting anchoring

Updated On : December 28, 2022 / 3:30 PM IST

Anchor Suma : తెలుగు యాంకరింగ్ రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ సుమ. దాదాపు 15 ఏళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు వారిని అలరించడమే కాదు, వారి ఇంటిలో ఒకరిగా మారిపోయింది. మలయాళీ అమ్మాయి అయినా అచ్చ తెలుగు మాటలతో స్టార్ మహిళగా తెలుగు మహిళల్లో ఒకరిగా నిలిచిపోయింది. టీవీ షోలు, సినిమా ఫంక్షన్‌లు, ప్రత్యేక ఇంటర్వ్యూలు.. ఇలా ఎక్కడైనా సుమ ఉండాల్సిందే.

Anchor Suma : షోలో కన్నీళ్లు పెట్టుకుంటూ.. యాంకరింగ్ కి విరామం ప్రకటించిన సుమ..

అయితే ఈ స్టార్ యాంకర్.. యాంకరింగ్‌కి బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పిన ఒక వీడియో బయటకి రావడంతో, అందర్నీ షాక్ కి గురిచేసింది. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కానున్న న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొన్న సుమ.. యాంకరింగ్‌కి బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో, సుమ దీనిపై స్పందించింది.

“రీసెంట్ గా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది. దాని ప్రోమో కూడా రిలీజ్ చేసాము. ఆ ప్రోమో కొంచెం హల్‌చల్ చేస్తుంది. అందులో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తమే. అయితే మొత్తం ఈవెంట్ అంతా చూస్తే, మీకు అసలు విషయం తెలుస్తుంది. కంగారుపడి నాకు చాలా మంది కాల్స్ అండ్ మెసేజ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా.. నేను టీవీ కోసమే పుట్టా, నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టా, నేను ఎటూ వెళ్లడం లేదు” అంటూ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది.