Site icon 10TV Telugu

Saindhav: జాస్మిన్‌గా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ఆండ్రియా.. సైంధవ్‌లో ఇంతమంది దేనికో..?

Andrea Jeremiah As Jasmine For Saindhav Movie

Andrea Jeremiah As Jasmine For Saindhav Movie

Saindhav: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త పాత్రలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ ఈ మూవీపై అంచనాలను మరింతగా పెంచేశాయి.

Saindhav: సైంధవ్ నుండి ఎంట్రీ ఇస్తున్న ‘జాస్మిన్’.. ఎప్పుడంటే..?

ఇక ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు పలువురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మల ఫస్ట్ లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాలో జాస్మిన్ అనే పాత్రలో మరో బ్యూటీ ఆండ్రియా జెర్మియా నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సైంధవ్ మిషిన్‌లో జాస్మిన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

Saindhav: సైంధవ్ కోసం ‘హిట్’ భామను పట్టుకొచ్చిన శైలేష్..!

కాగా, ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, మున్ముందు ఇంకా ఎంతమందిని రివీల్ చేస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, వెంకీ మెయిన్ లీడ్‌లో నటిస్తున్న సైంధవ్‌లో ఇంతమంది హీరోయిన్లు ఎందుకో.. వారు ఎలాంటి పాత్రల్లో నటిస్తారో అనే చర్చ అభిమానుల్లో సాగుతుంది. మరి ఈ సినిమాలో ఈ హీరోయిన్లు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శైలేష్ వీరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలియాలంటే సైంధవ్ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version