Andrea Jeremiah: బాబోయ్.. ఆ సీక్వెల్ నావల్ల కాదు.. ఆ డైరెక్టర్ తో నేను పని చేయలేను
ధనుష్ యుగానికి ఒక్కడు సీక్వెల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆండ్రియా(Andrea Jeremiah).
- V Santhosh Kumar
- Published On : April 2, 2026 / 05:18 PM IST
Andrea Shocking Comments on Yuganiki Okkadu Sequel
- యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్
- హీరోగా కార్తీ ప్లేస్ లో ధనుష్
- తాను నటించడం లేదంటూ చెప్పిన ఆండ్రియా
Andrea Jeremiah: తమిళ హీరో కార్తీ కెరీర్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘యుగానికి ఒక్కడు’ (ఆయిరత్తిల్ ఒరువన్). దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు, దాదాపు 16 ఏళ్ళ తరువాత చిత్రానికి సీక్వెల్ రాబోతుందన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా, దర్శకుడు సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్‌తో పార్ట్-2 చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు.
Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో అద్భుతం.. హనుమంతుడికి సూర్య తిలకం.. అచ్చం అయోధ్య రామయ్య లాగే!
ప్రస్తుతం ఈ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ధనుష్ కాల్షీట్లు ఖాళీ అవ్వగానే 2026 చివరలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ సీక్వెల్‌లో మొదటి భాగంలో నటించిన హీరోయిన్ ఆండ్రియా(Andrea Jeremiah) మాత్రం తాను ఈ సీక్వెల్ లో నటించడం లేదని స్పష్టం చేసింది. సెల్వరాఘవన్ సెట్‌లో పని చేయడం చాలా కష్టమని, మొదటి భాగం కోసం ఏకంగా 200 రోజులు కష్టపడాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ కష్టం వల్లే తదుపరి సినిమాల్లోని పాత్రలను సులభంగా చేయగలిగానని చెప్పినప్పటికీ, సీక్వెల్‌లో మాత్రం నటించనని ఆమె తేల్చి చెప్పింది.
దీంతో, యుగానికి ఒక్కడు సినిమాపై ఆండ్రియా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సీక్వెల్ నుంచి ఆండ్రియా తప్పుకోవడంతో ధనుష్ సరసన కొత్తగా ఏ హీరోయిన్ నటిస్తుందనేది కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి 2026లో చివర్లో మొదలుకానున్న ఈ సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఎన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్థుండై అనేది చూడాలి.
